కన్నప్ప ప్లస్సు మైనస్సు అదే..!

మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప.

Update: 2025-02-04 17:30 GMT

మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడన్న విషయం తెలిసిందే. మంచు విష్ణు తో పాటుగా ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భారీగానే ఉంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు ఇలా చాలా పెద్ద తారాగణం తో మంచు విష్ణు కప్పన్న రాబోతుంది. ఐతే తారలు ఎంత పెద్ద వారులైనా సరే వారిని వాడుకోవడంలోనే అసలైన కిక్ ఉంటుంది.

కన్నప్ప సినిమాలో మిగతా వారందరినీ పక్కన పెడితే ప్రభాస్ పాత్ర ఒక్కటి కరెక్ట్ గా క్లిక్ అయితే చాలు మిగతాది అంతా రెబల్ స్టార్ ఫ్యాన్స్ చూసుకుంటారు. ఐతే సినిమాలో స్టార్స్ ని ఐతే తీసుకున్నాడు కానీ వారి విషయంలో ఎలాంటి జాగ్రత్త వహిస్తున్నాడు అన్నది మాత్రం తెలియట్లేదు. మంచు విష్ణు కన్నప్ప సినిమాకు ఈ భారీ తారాగణమే ప్లస్ అయ్యేలా ఉంది. కచ్చితంగా సినిమాపై బజ్ పెంచేందుకు భారీ ఓపెనింగ్స్ తెచ్చేందుకు ఇది సహకరిస్తుంది.

ఐతే స్టార్స్ ని ఎంపిక చేసినట్టుగానే సినిమాలో వారి పాత్రలను కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తే మాత్రం సినిమాకు వర్తబుల్ అనిపించేలా ఉంటుంది. ఈ స్టార్సే సినిమాకు ప్లస్సు అనిపించినా ఈ పాత్రలు డిజైన్ చేసిన విధానం ఇంకా వారి నిడివి కూడా సినిమా రిజల్ట్ మీద ఆధారపడుతుంది. సో వాళ్లు ఎంత ప్లస్సో మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆమధ్య కన్నప్ప టీజర్ కాస్త నిరాశ పరచినా సరే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు మరో టీజర్ ని సిద్ధం చేస్తున్నారట.

కన్నప్ప ఈ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తుంది. ఐతే సినిమా విషయంలో మంచు విష్ణు ప్లానింగ్ బాగుంది అంతేకాదు కన్నప్ప ఈవెంట్ కి అందులో నటించిన స్టార్స్ అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కన్నప్ప తో మంచు విష్ణు ఏం చేస్తాడు అన్నది చూడాలి. సినిమా గురించి రీసెంట్ గా ప్రముఖ రైటర్ బివిఎస్ రవి అయితే తాను ఫస్ట్ హాఫ్ చూశాను అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. మరి నిజంగానే కన్నప్ప బాగుంటే మాత్రం మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా మారుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News