తండ్రి పేరు చెప్పుకోని సిసలైన వారసుడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తండ్రి విద్యాసాగర్‌కు సినీ పరిశ్రమలో కానీ, అభిమానుల్లో కానీ తగిన గుర్తింపు రాలేదన్నారు విష్ణువర్ధన్.
విద్యాసాగర్ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతదర్శకుడిగా సుపరిచితులు. రజనీకాంత్ 'చంద్రముఖి'తో పాటు తమిళంలో పరవైగల్, పూమగల్, జైహింద్, ధుల్ రన్, దిల్, తులసి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. 'తిరుట్టుపయలే-2' తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ మాత్రం తన తండ్రి బాటలోనే ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం విష్ణువర్ధన్ ఏఆర్ రెహమాన్, జివి ప్రకాష్ కుమార్, తమన్ తదితర సంగీత దర్శకులతో కలిసి మ్యూజిక్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తండ్రి విద్యాసాగర్‌కు సినీ పరిశ్రమలో కానీ, అభిమానుల్లో కానీ తగిన గుర్తింపు రాలేదన్నారు విష్ణువర్ధన్. తన సంగీతాన్ని సినీ పరిశ్రమ సరిగా వాడుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకంటూ పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
తన తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించుకోవడం లేదని అన్నారు. తనదైన ప్రతిభతో ఈ రంగంలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విద్యాసాగర్ కుమారుడని ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని ఆయనకు తెలిసిన కొందరు అడుగుతున్నారు. ఆ విషయాన్ని తాను చెప్పదలచుకోలేదని విష్ణువర్ధన్ అన్నారు. తండ్రి పేరు ఉపయోగించుకుని, లేదా పరిచయాల్ని ఉపయోగించుకుని ఎదగాలని అనుకుంటారు. కానీ ఈ వారసుడు అలా లేడు. అతడు ఇతరులకు పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.