విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం విశ్వక్ లేడీ గెటప్ కూడా వేసుకున్నాడు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న లైలా, రీసెంట్ గా జరిగిన రాజకీయ వివాదం కారణంగా బాగా పాపులరైంది. మొత్తానికి మంచి బజ్ తో రేపు విశ్వక్ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా కోసం విశ్వక్ చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్స్ లో కూడా ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ లో విశ్వక్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటూ ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. అతను మరెవరో కాదు విశ్వక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ రొహ్ తాస్ చౌదరి. గత కొన్నాళ్లుగా విశ్వక్ ఎక్కడికి వెళ్లినా ఆయన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉండటానికి రొహ్ తాస్ కూడా విశ్వక్ వెంటే వెళ్తున్నాడు.
బయటకు వెళ్లినప్పుడు విశ్వక్ కు ఎక్కడా, ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడమే ఈయన పని. హర్యానాకు చెందిన రొహ్ తాస్ 7 అడుగుల ఎత్తు ఉంటాడు. గతంలో పలు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల దగ్గర పర్సనల్ సెక్యూరిటీగా పనిచేసిన రొహ్ తాస్ చౌదరి ఇప్పుడు విశ్వక్ కు కమెండో బాడీ గార్డ్ గా మారాడు.
రొహ్ తాస్ కు విశ్వక్ నెలకు చాల ఎక్కువ జీతం ఇచ్చి మరీ తెచ్చుకున్నాడట.టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉన్నారు. బయటకు వెళ్లాలంటే బాడీ గార్డ్స్ లేకుండా ఎవరూ వెళ్లరు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు బాడీ గార్డ్స్ ను సెక్యూరిటీ కోసం పెట్టుకుంటూ ఉంటారు.
తనకు ఎక్కువ మందిని బౌన్సర్లుగా పెట్టుకోవడం ఇష్టం లేకనే, సెక్యురిటీగా ఒక సాలిడ్ పర్సన్ ఉంటే చాలనుకున్న విశ్వక్.. ఏడాది క్రితం ముంబైలో రొహ్ తాస్ ను కలిశానని, అతని కోసం చాన్నాళ్లు వెయిట్ చేసి ఇప్పుడు బాడీ గార్డ్ గా పెట్టుకున్నానని విశ్వక్ రొహ్ తాస్ గురించి చెప్పుకొచ్చాడు. మొత్తానికి లైలా సినిమాతో విశ్వక్ ఫేమస్ అయినట్టే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు.