విశ్వక్ సేన్ ప్లాన్స్.. ఎలా సాగుతున్నాయంటే..

టాలీవుడ్‌లో కొత్త హీరోలు వచ్చి కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్న వేళ, విశ్వక్ సేన్ మాత్రం తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.;

Update: 2025-03-04 04:22 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోలు వచ్చి కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్న వేళ, విశ్వక్ సేన్ మాత్రం తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఎప్పుడూ సొంతంగా తన సినిమాలను ప్లాన్ చేసుకుని, కంటెంట్‌ను నమ్మి ప్రయోగాలు చేసే ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుస రెండు సినిమాలు నిరాశపర్చడంతో పాటు HIT ఫ్రాంచైజ్ కు సంబంధించి అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

హిట్ 3 విషయంలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. విశ్వక్‌కు సినిమాలో గెస్ట్ రోల్ లాంటి పాత్రను ఆఫర్ చేసినా, కథ పూర్తిగా క్లారిటీ లేదనే భావనతో అతను బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పాత్రకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల కూడా వెనుకడుగు వేసినట్లు టాక్. విశ్వక్ తనకు కథ నచ్చకపోయినా, పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోయినా అసలు కాంప్రమైజ్ కాడని అనిపిస్తుంది.

ఇక ఈ సమయంలో కొత్త ప్లాన్‌తో తన ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వక్ స్టైల్ యాక్షన్, యూత్‌పుల్ సినిమాలకు మార్కెట్ మంచి స్థాయిలో ఉంది. కానీ, అతడు ఎంచుకున్న కథలు, తీసుకున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వలేకపోయాయి. లైలా సినిమా కథతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. అలాగే మెకానిక్ రాకీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినప్పటికీ, కమర్షియల్‌గా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.

దీంతో విశ్వక్ ఇప్పుడు మళ్ళీ తాను ఏం చేయాలో సమర్థంగా అర్థం చేసుకుని, కొత్తగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ ఫంకీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి వినోదాత్మక కథతో తెరకెక్కుతోందని సమాచారం. దర్శకుడు అనుదీప్ కామెడీ టేకింగ్ బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో, విశ్వక్ పూర్తిగా తన యాస, బాడీ లాంగ్వేజ్‌ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడట.

గతంలో ఎప్పుడూ లేని విధంగా కామెడీ టచ్‌తో ఎంటర్‌టైన్ చేసే యాంగిల్‌ని ప్రదర్శించబోతున్నాడని టాక్. అలాగే అనిరుధ్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. అలాగే మరోవైపు, ఈ నగరానికి ఏమైంది 2 విషయంలో విశ్వక్, తరుణ్ భాస్కర్ కలిసి మరోసారి టచ్‌లోకి వచ్చారు. కానీ ఈసారి కథను పూర్తిగా విభిన్నంగా తీసుకెళ్లాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

మొదటి పార్ట్ నుంచి వచ్చే క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. అలాగే విశ్వక్ మరో కొత్త యూత్ కంటెంట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు, ఇది పూర్తిగా అర్బన్ క్లాసిక్ ఫీల్ కలిగిన సినిమా అని సమాచారం. ఇక, విశ్వక్ సేన్‌కి ఈ ఏడాది చాలా కీలకం. ఫంకీ చిత్రం ఎంతవరకు హిట్ అవుతుందో అన్నది అతడి కెరీర్‌కు చాలా ప్రాముఖ్యమైన అంశం. అందుకే ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని మార్పులతో కొత్తగా ట్రై చేస్తున్నాడు. మరి ఈసారి విశ్వక్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News