మాస్ కా దాస్ డెడికేషన్.. సూపరంతే..!
చాలా తక్కువ టైం లోనే తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్. ఆ మాస్ ఇమేజ్ కి భిన్నంగా ప్రయోగాలు కూడా చేస్తూ వస్తున్నాడు.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనతో మనమే పోటీ పడాలని అంటుంటారు. అది నిజమే ముఖ్యంగా సినీ పరిశ్రమలో అయితే ఒకరితో ఒకరికి పోటీ తప్పదు. తమకు వచ్చిన ఇమేజ్ కి తగినట్టుగా సినిమాలు చేస్తేనే ఇక్కడ ఉండగలుగుతారు. లేదంటే పెట్టాబేడా సర్దేయాల్సిందే. అందుకే స్టార్ హీరోలైనా యువ హీరోలైనా తమ సత్తా చాటేందుకు వెనుకడుగు వేయరు. ఐతే ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇంకాస్త అడ్వాన్స్ గా వెళ్తున్నాడు.
చాలా తక్కువ టైం లోనే తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్. ఆ మాస్ ఇమేజ్ కి భిన్నంగా ప్రయోగాలు కూడా చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ గా అతను లేడీ గెటప్ వేసుకుంటూ చేస్తున్న సినిమా లైలా. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కోసం చాలా కష్టపడ్డాడు. టీజర్ చూస్తే విశ్వక్ సేన్ అమ్మాయి లుక్ లో బాగున్నాడని అనిపించింది. ఐతే అలా రెడీ అవడానికి వెనక ఎంత టైం పట్టిందో చూపిస్తూ ఒక వీడియో వదిలారు.
విశ్వక్ లైలాగా మారిన సమయం అంటూ లేటెస్ట్ గా లైలా మేకింగ్ అదే లైలా సిద్ధం చేసే వీడియో రిలీజ్ చేశారు. విశ్వక్ క్లీన్ షేవ్ తో హెయిర్ కూడా ట్రిం చేసుకుని ఫేస్ మొత్తం లేడీ గెటప్ కి సరిపోయేలా మార్చేసుకున్నాడు. జస్ట్ లేడీ గెటప్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక్క కారణంతో విశ్వక్ సేన్ ఇలా చేస్తున్నాడని చెప్పొచ్చు. ఆల్రెడీ నిర్మాత సాహు గారపాటి చెప్పినట్టుగా డైరెక్టర్ రామ్ నారాయణ కథ చెప్పగానే లేడీ గెటప్ వేయడం కష్టమని నలుగురు హీరోలు స్క్రిప్ట్ చేయనన్నారట.
ఐతే విశ్వక్ సేన్ మాత్రం దీన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకుని తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని యుటిలైజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. లైలా టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం విశ్వక్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా అన్నది చూడాలి. లైలా సినిమాలో విశ్వక్ సోను మోడల్ గా మాస్ లుక్ తో పాటు లైలాగా లేడీ గెటప్ లో కూడా అదరగొట్టబోతున్నాడు.