విశ్వక్ మెకానిక్ రాకీ.. కాస్త ఆలస్యంగానే..

యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Update: 2024-09-30 04:42 GMT

యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మించారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. విశ్వక్ సేన్ నుంచి ఈ ఏడాది రాబోయే మూడో సినిమా ‘మెకానిక్ రాకీ’ కావడం విశేషం.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నిజానికి దీపావళి కానుక అక్టోబర్ 31న ‘మెకానిక్ రాకీ’ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో విశ్వక్ సేన్ ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్రానికి పోటీగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రెడీ అవుతోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్, సాంగ్ ఆకట్టుకున్నాయి. కాన్సెప్ట్ ఏదో ఇంటరెస్టింగ్ గా ఉందనే అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్ళింది. ‘లక్కీ భాస్కర్’, ‘మెకానిక్ రాకీ’ సినిమాలు రెండు మీడియం రేంజ్ మూవీస్ గానే వస్తున్నాయి.

దీపావళి రేసులో ఈ రెండు ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద నష్టమేమీ ఉండదు. అయితే ‘మెకానిక్ రాకీ’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో రిలీజ్ డేట్ ని వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విశ్వక్ సేన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ డేట్ ని మేకర్స్ తొలగించారు. దీంతో మూవీ వాయిదా పడటం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తోంది.

త్వరలో రిలీజ్ డేట్ ని మళ్ళీ ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. నవంబర్ 7న మేగ్జిమమ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ‘మెకానిక్ రాకీ’ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని కసితో విశ్వక్ సేన్ ఉన్నారు. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన ‘గామి’ మూవీ కమర్షియల్ హిట్ అయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసి డీసెంట్ టాక్ తో సరిపెట్టుకుంది.

Tags:    

Similar News