నాకు భయం లేదు... ఆ సినిమాలు చేయను : విశ్వక్ సేన్
తాజాగా ఒక మీడియా సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ లైలా సినిమా తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలుస్తుందని అన్నాడు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ గత ఏడాది గామి, గ్యాగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విశ్వక్ సేన్ రేపు 'లైలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి సారి విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించడంతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న కారణంగా అంచనాలు పెరిగాయి. లైలా సినిమాతో విశ్వక్ సేన్ సక్సెస్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక మీడియా సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ లైలా సినిమా తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలుస్తుందని అన్నాడు. తాను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ ఇదే అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విశ్వక్ సేన్ తన ఫ్యూచర్ మూవీస్ గురించి చెప్పుకొచ్చాడు. మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ హర్రర్ సినిమాలు చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. హర్రర్ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు లేదని, తనకు హర్రర్ సినిమాలు చూస్తు ఉంటే భయం కలగదు. అందుకే హర్రర్ సినిమాలు చేసే ఆలోచన లేదు అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
హర్రర్ సినిమాలు చూసిన వారు కొందరు చాలా భయపడ్డాను అని చెప్తూ ఉంటారు. ఆ సినిమాను నేను ఒక్కడినే వెళ్లి చూస్తూ ఉంటాను. హర్రర్ సినిమాలు అంటే నాకు అస్సలు భయం లేదు. నేను భయంను నటించలేను. అందుకు నేను హర్రర్ సినిమాను ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ చేయను అంటూ తేల్చి చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ హర్రర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అందుకే విశ్వక్ సేన్ సైతం అలాంటి ఒక సినిమాను చేయడం ద్వారా ప్రేక్షకుల మెప్పు పొందవచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. కానీ విశ్వక్ సేన్‌కి మాత్రం ఆ ఆలోచన లేదని తేలిపోయింది.
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'రాజా సాబ్' సినిమా హర్రర్ కామెడీ అనే విషయం తెల్సిందే. ఆ ఒక్కటే కాకుండా రాబోయే రోజుల్లో చాలా తెలుగు సినిమాలు హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యంగ్ హీరోలు సైతం ఆ జోనర్‌లో సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం హర్రర్ సినిమాల జోలికి వెళ్లను అంటూ తేల్చి చెప్పాడు. అంతే కాకుండా భయపడటం తెలియని తనకు హర్రర్ సినిమా చేసినా ఆకట్టుకోక పోవచ్చని విశ్వక్ సేన్ భావిస్తున్నాడు. ఫ్యూచర్‌లో విశ్వక్ సేన్ ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాలి.