విశ్వక్ నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉందంటే..
డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తున్నప్పటికీ విశ్వక్ కు ఈమధ్య లక్కు కలిసి రావడం లేదు.
డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తున్నప్పటికీ విశ్వక్ కు ఈమధ్య లక్కు కలిసి రావడం లేదు. చివరగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాస్త హడావుడి చేసిన విశ్వక్ ఆ తరువాత పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక ‘లైలా’ సినిమా తర్వాత విశ్వక్ సేన్ తన కెరీర్‌లో కొత్త ప్లాన్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా ఏ హీరోకైనా ఒకటి రెండు డిజాస్టర్లు సహజమే. కానీ ‘లైలా’ మీద వచ్చిన నెగటివ్ రివ్యూలు, కంటెంట్‌పై వచ్చిన విమర్శలు అతని మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
దీంతో ఇప్పుడు అతనికి ఉన్న అవకాశాలను గట్టిగా ఉపయోగించుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘ఫంకీ’ చాలా కీలకం. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు అనుదీప్ కెవి, ‘జాతిరత్నాలు’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత తీసిన ‘ప్రిన్స్’ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో ఆయనకు కూడా మరో అవకాశం లభించనుంది.
అసలైతే ఈ ప్రాజెక్ట్ మొదట మాస్ మహారాజా రవితేజ కోసం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల భాను భోగవరపు ప్రాజెక్ట్‌ను దక్కించుకోగా, ఈ సినిమా విశ్వక్ సేన్‌కు వెళ్లింది. ఈ ప్రాజెక్ట్ రెండు కారణాల వల్ల విశ్వక్‌కి కీలకం. మొదటిది, అనుదీప్ టైమింగ్‌కి తగ్గట్టుగా సినిమాను మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేసేలా చేయడం. రెండవది, తన మీద వచ్చిన నెగటివిటీకి సమాధానం ఇవ్వడం. ‘ఫంకీ’లో కథ కరెక్ట్‌గా ఉంటే, ప్రేక్షకులు అందరికీ ఇది మంచి కంబ్యాక్ అవుతుందని భావిస్తున్నారు.
హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాతో ఆమె కూడా మళ్లీ టాలీవుడ్‌లో హిట్ కొడుతుందా? అనేది ఆసక్తిగా మారింది. ఇక విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లలో మరో ఆసక్తికరమైనది ‘జిత్తూ పటేల్’. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. అయితే దీనికి నిర్మాత ఇంకా ఫిక్స్ కాలేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా, విశ్వక్ స్టైల్‌కు కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, ఇటీవల ఓ హారర్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ చెప్పిన కథను కూడా విశ్వక్ ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఫంకీ వర్క్ నడుస్తుండగా, మిగతా రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ‘లైలా’ తర్వాత వస్తున్న ఈ సినిమాలు అతని కెరీర్‌ను మళ్లీ పాత ట్రాక్‌కి తీసుకురావడం ఖాయం. మరి, విశ్వక్ ఈ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.