లైలా బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు టాలెండెట్ హీరో విశ్వక్ సేన్.
విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు టాలెండెట్ హీరో విశ్వక్ సేన్. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ వాటిలో రెండు సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు లైలా అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి లైలాను నిర్మించాడు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ తన కెరీర్లోనే మొదటిసారిగా లేడీ గెటప్ లోకి అవతారమిచ్చాడు. దీంతో లైలా పై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి.
టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి టీజర్, ట్రైలర్ వాటికి తోడు కొన్ని వివాదాస్పద అంశాలు లైలాపై మంచి బజ్ ను క్రియేట్ అయ్యేలా చేశాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటి దాదాపు రూ. 35 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే లైలా సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు మంచి డిమాండే ఏర్పడింది. ఆంధ్రా, నైజాం ఏరియాల్లో లైలా హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో లైలా మూవీ రూ. 7 కోట్ల షేర్, రూ.14 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.
మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ అన్నీ కలిపి మరో రూ. 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటే మొత్తం లైలాకు రూ.8.2 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో టాక్. దాని ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు రూ.10 కోట్లకు పైగా షేర్ రాబడితే లైలా లాభాల్లోకి వచ్చినట్టే. సినిమాకు టాక్ బావుంటే అది పెద్ద కష్టమేమీ కాదు.