విశ్వక్ వన్ మ్యాన్ షో.. 'లైలా' ట్రైలర్ అదిరింది
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయన ఆయన.. ఇప్పుడు లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కూడా సందడి చేయనున్నారు విశ్వక్ సేన్.
రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న లైలా మూవీలో కొత్త అందం ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ లో కూడా ఫుల్ జోష్ నింపింది. అదే జోష్ తో మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లైలా ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.
ట్రైలర్ లో తొలుత పోలీసులు, దుండగుల వెంబడిస్తున్న సోను మోడల్ గా విశ్వక్ సేన్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకోవడానికి లైలాగా మారాలని డిసైడ్ అవుతారు. అదే సమయంలో అబ్బాయి అని తెలియక వారు ఆమెతో ప్రేమలో పడతారు. మరి చివరకు ఏమైందని పూర్తి సినిమాగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
అయితే సినిమాకు గాను రెండు రోల్స్ లో విశ్వక్ ఒదిగిపోయారని క్లియర్ గా తెలుస్తోంది. ప్రతి సీన్ కోసం ఆయన ఎంత డెడికేట్ గా వర్క్ చేశారో అర్థమవుతుంది. సోనూ, లైలా.. రెండు రోల్స్ లో కూడా అదరగొట్టేశారు. సినిమాలో ఆయన చేసిన అల్లరి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంది. డైలాగ్ టైమింగ్ అయితే అదుర్స్ అని చెప్పాలి.
ట్రైలర్ లో ఆకాంక్ష శర్మ గ్లామర్ ను కూడా యాడ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ సీన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. పెర్ఫెక్ట్ గా సూట్ అయింది. దర్శకుడు రామ్ నారాయణ్ చక్కని స్క్రీన్ ప్లే, నిర్మాత సాహు గారపాటి ప్రొడక్షన్ వాల్యూస్.. ట్రైలర్ ను ఓ రేంజ్ లో తీసుకెళ్లాయి. ఓవరాల్ గా సినిమా అద్భుతమైన ట్రీట్ గా ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ తో మూవీపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మరి లైలా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.