విశ్వంభర.. ట్రేండింగ్ లో నెంబర్ వన్..

దసరా సందర్భంగా విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరో మెట్టు పైకెత్తింది.

Update: 2024-10-13 16:39 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పట్ల అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దసరా సందర్భంగా విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరో మెట్టు పైకెత్తింది. ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో, విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టీజర్ ప్రారంభం నుండే అభిమానుల మనసును గెలుచుకుంది. "విశ్వం యొక్క ఆధ్యాత్మిక రహస్యం" అనే పాయింట్ ద్వారా ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చారు. టీజర్‌లోని భారీ గ్రాఫిక్స్, మరియు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉన్నాయి.

టీజర్‌లో కనిపించిన డైనోసార్ లాంటి ప్రాణులు కూడా సినిమాకు కొత్తదనాన్ని చేకూర్చాయి. చెడు శక్తులు విజయం సాధించాలనుకుంటున్నా, ఆరాచకానికి మంగళం పాడే మహా యుద్ధం రాబోతోందనే సంకేతాన్ని టీజర్ స్పష్టంగా ఇచ్చింది. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉంది. టీజర్‌లో మెగాస్టార్ రెక్కల గుఱ్ఱంపై రావడం, చెడు శక్తులపై యుద్ధానికి సిద్ధమయ్యే విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఆఖరి సన్నివేశంలో హనుమాన్ విగ్రహం ముందు మెగాస్టార్ చిరంజీవి తన గధతో పవర్ఫుల్ గా కనిపించడం అభిమానులకు కనుల పండుగనే చెప్పాలి. అంతేకాదు, టీజర్‌లో వినిపించిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. "చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని సృష్టిస్తుంది," అనే పాయింట్ సినిమా లోతును, కథలోని క్లైమాక్స్‌ను సూచిస్తోంది.

టీజర్ సక్సెస్ తో యూవీ క్రియేషన్స్ నుండి వచ్చే అప్‌డేట్ పై ప్రేక్షకుల లో ఆసక్తి పెరిగింది. ఇక సినిమాను మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, గేమ్ చేంజర్ సినిమా కూడా అదే సమయానికి రావడం వలన క్లాష్ ఉండకూడదు అని వాయిదా వేశారు. ఇక సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మేకర్స్ త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తం మీద, విశ్వంభర టీజర్ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే విధంగా ప్రేక్షకులను రంజింపజేసింది. మరి రాబోయే అప్డేట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి.

Tags:    

Similar News