విశ్వంభర టీమ్ ఫుల్ బిజీ.. ఎందుకంటే..
అదే సమయంలో వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ పెంచేందుకు వివిధ కంపెనీలతో చిరు, వశిష్ట చర్చలు ప్రారంభించినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం విడుదల వాయిదా వేశామని మేకర్స్ చెబుతున్నారు. అది నిజం కాదని, షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడంతో పాటు వీఎఫ్ ఎక్స్ అవుట్ పుట్ బాగోలేకపోవడమే పోస్ట్ పోన్ కు కారణమని వార్తలు వస్తున్నాయి.
అయితే విశ్వంభర మేకర్స్.. దసరా కానుకగా టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విజువల్ వండర్ గా మేకర్స్ తీసుకొచ్చిన టీజర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ అస్సలు బాగోలేదని అనేక మంది కామెంట్లు పెట్టారు. వివిధ హాలీవుడ్ మూవీల నుంచి రిఫరెన్స్ తీసుకున్నారని ప్రూఫ్స్ తో సహా పోస్టులు పెట్టారు. అలా తీసుకున్నా.. వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ చాలా చీప్ గా ఉందని అన్నారు. దీంతో మేకర్స్.. అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
సినిమా రిలీజ్ వాయిదా పడింది కనుక.. తమ దొరికిన టైమ్ లో వీఎఫ్ ఎక్స్ ను రిపేర్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు బాగా సాన్నిహిత్యంగా ఉండే పలువురు డైరెక్టర్లను ఆయన చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వశిష్టకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై.. చోటా కె నాయుడుతో చిరు మాట్లాడారట.
అదే సమయంలో వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ పెంచేందుకు వివిధ కంపెనీలతో చిరు, వశిష్ట చర్చలు ప్రారంభించినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన పని మొదలవుతుందని సమాచారం. ఒక ప్లాన్ ప్రకారం.. అంతా సెట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదని, మంచి అవుట్ పుట్ ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు వినికిడి.
అయితే సోషియో ఫాంటసీ ప్రాజెక్టుకు వీఎఫ్ ఎక్స్ నాణ్యత చాలా ముఖ్యమైనది. సినీ ప్రియులను కచ్చితంగా ఆకట్టుకోవాలి. లేకుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది. మరోవైపు, భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత.. చిరు విశ్వంభర సినిమా చేస్తున్నారు. మధ్యలో కళ్యాణ్ కృష్ణకు ఓకే చెప్పినా.. దాన్ని పక్కన పెట్టి విశ్వంభరను స్టార్ట్ చేశారు. మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ విషయంలో నెగిటివిటీ రావడంతో వాటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరి మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.