విశ్వంభర సర్ ప్రైజ్.. ఇది హై వోల్టేజ్ లుక్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా 'విశ్వంభర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-22 05:21 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా 'విశ్వంభర' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'బింబిసార'తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురానున్నాడు. ‘విశ్వంభర’ చిత్రంలో నెవ్వర్ బిఫోర్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. అత్యున్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని మేకర్స్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.


ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు, హృదయాన్ని తాకే డ్రామా మరింత హైలెట్ అవుతాయని సమాచారం. ఇక నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ లుక్ ను విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్, ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ పోస్టర్‌లో చిరంజీవి ఒక కొండపై కూర్చొని, శక్తివంతమైన త్రిశూలాన్ని తన చేతుల్లో పట్టుకొని ఉన్న తీరు అద్భుతంగా ఉంది. ఏదో కొత్త ప్రపంచాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది. ‘‘When Myths Collide, Legends Rise’’ అనే ట్యాగ్ తో హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేశారు. మెరుపుల మధ్యలో పర్వతాలు హైలెట్ అయిన దృశ్యం కూడా సూపర్బ్ అనేలా ఉంది.

చిరంజీవి కొత్తగా కనిపిస్తుండగా, ఆయన చూపులోని సీరియస్ నేచర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆకాశంలో మెరుపులు, పర్వతాల మధ్య రహస్య శక్తులు పోటెత్తుతున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో, సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, అశికా రంగనాథ్ లాంటి కథానాయికలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కునాల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత మెగాస్టార్ సినిమాకు ఆయన వర్క్ చేస్తుండడంతో మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక స్పెషల్ పోస్టర్ తో మేకర్స్ మెగాస్టార్ కు విషెస్ అందిస్తూ ఒక మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. అలాగే విశ్వంభర సినిమా 2025 జనవరి 10న గ్రాండ్ గా విడుదల అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News