విశ్వంభర.. ఆ సినిమాకు లింక్?
అయితే తండ్రి నిర్మాత కావడంతో ప్రేమలేఖ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ట.. ఒక్క సినిమాతోనే యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేశారు.
డైరెక్టర్ వశిష్ట.. ఫస్ట్ మూవీ బింబిసారతో మంచి సక్సెస్ అందుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టైమ్ ట్రావెల్, టెలిపోర్టేషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే తండ్రి నిర్మాత కావడంతో ప్రేమలేఖ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ట.. ఒక్క సినిమాతోనే యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేశారు.
చాలా ఏళ్ల తర్వాత బింబిసార సినిమాతో దర్శకుడిగా మారి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. చిరు, వశిష్ట కాంబోలో రూపొందుతున్న విశ్వంభర మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సోషియో ఫాంటసీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ మూవీపై సినీ ప్రియులతో పాటు మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
అయితే దర్శకుడు వశిష్ట.. ఎక్స్ (అప్పటి ట్విట్టర్) కవర్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. విశ్వంభర, బింబిసార సినిమాల పేర్లు వచ్చేలా ఒక పోస్టర్ ను డిజైన్ చేయించి పెట్టుకున్నారు వశిష్ట. దీంతో ఆ రెండు సినిమాలను కలుపుతూ కొత్త సినిమాటిక్ యూనివర్స్ వస్తుందని ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా అందరూ ఈ విషయంపై తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, కల్కి యూనివర్స్ ఉండగా.. ఇప్పుడు మరో యూనివర్స్ ఆన్ లోడింగ్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. బింబిసార, విశ్వంభర సినిమాలకు లింక్ ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా వశిష్ట తీయబోయే మూవీస్ తో వాటిని లింక్ చేస్తారని అంటున్నారు. అయితే బింబిసార సినిమా లాస్ట్ లో సీక్వెల్ ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని రోజుల క్రితం ప్రీక్వెల్ ను ప్రకటించారు.
దర్శకుడిగా అనిల్ పాదూరిని ఎంచుకున్నారు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాకు విజువల్స్ వర్క్ చేసిన ఆయన.. ప్రీక్వెల్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వశిష్ట తప్పుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన యూనివర్స్ లో భాగంగా విశ్వంభర సినిమా తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో, విశ్వంభరలో త్రిగర్తలా రాజ్యాన్ని వశిష్ట ప్రస్తావించారో లేదో తెలియాలంటే కొన్ని నెలలు వేచి చూడాలి.