హరీష్ శంకర్ తో మరో సినిమా చేస్తా
మిస్టర్ బచ్చన్ సినిమాపై కొన్ని విషయాలు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని అన్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ బచ్చన్ మూవీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. ఈ సినిమాకి హరీష్ శంకర్ చేసిన ప్రమోషన్స్ గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ సినిమాపై కొన్ని విషయాలు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని అన్నారు. స్క్రిప్ట్ దశలోనే కథ కొంత బలహీనంగా ఉన్నా కూడా పెజెంటేషన్ కి వచ్చేసరికి అంతా సెట్ అవుతుందని భావించామంటూ విశ్వప్రసాద్ తెలిపారు.
విశ్వప్రసాద్ హరీష్ శంకర్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ విషయంలో హరీష్ శంకర్ పై నిర్మాత విశ్వప్రసాద్ సీరియస్ గా ఉన్నారనే కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా ఈ ప్రచారంపై టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను హరీష్ శంకర్ మీద ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పుకొచ్చారు.
'మొదటగా హరీష్ శంకర్ నాకు మంచి ఫ్రెండ్. తరువాత ఒక డైరెక్టర్ గా అతనితో నేను కొలాబరేట్ అయ్యాను. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాను అనే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ ప్రయాణంలో నేర్చుకోవడానికి కావాల్సిన చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయని, ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. అయితే నేను చేసిన కామెంట్స్ ఒకటైతే వాటిని హరీష్ శంకర్ గురించి అన్నట్లు గా మీడియాలో ప్రాజెక్ట్ చేశారు. హరీష్ శంకర్ తో కలిసి వర్క్ చేయడంపై నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
మరోసారి కూడా కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేకర్ గా అతనికి అద్భుతమైన ప్రతిభ ఉంది. సినిమా ఫెయిల్ అయ్యాక డిస్టిబ్యూటర్స్ కి మనీ అడ్జస్ట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా వదులుకోవడానికి హరీష్ శంకర్ సిద్ధమయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం అతనికుంది. దయచేసి మీడియా వారు నేను చెప్పిన లైన్స్ మధ్యలో అర్ధాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా రాంగ్ గా ప్రచారం చేయకండి' అని విశ్వప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇక విశ్వప్రసాద్ పోస్ట్ పై హరీష్ శంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. నాకు తెలుసు సర్… ప్రచారం జరిగిన దాంట్లో ఒక్క మాట కూడా మీరు మాట్లాడి ఉండరని నేను బలంగా నమ్మాను. షూటింగ్ సమయంలో మీరిచ్చిన సపోర్ట్ అస్సలు మరచిపోను. కచ్చితంగా భవిష్యత్తులో మీతో కలిసి వర్క్ చేయడమే కాకుండా మంచి సక్సెస్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్యూ సర్ అంటూ హరీష్ రిప్లై ఇచ్చారు. విశ్వప్రసాద్ వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.