చిరు విశ్వంభర... ఆరంభమే అదిరిపోయింది
విశ్వంభర సినిమా కాన్సెప్ట్ వీడియో నెట్టింట 5 మిలియన్లకుపైగా డిజిటల్ వ్యూస్ సాధించిన నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది.
సూపర్ హిట్ మూవీ బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి విశ్వంభర టైటిల్ ను ఇటీవల ఫైనల్ చేశారు. సంక్రాంతి సందర్భంగా విశ్వంభర మూవీ టైటిల్ లుక్ ను, కాన్సెప్ట్ వీడియోను షేర్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
విశ్వంభర సినిమా కాన్సెప్ట్ వీడియో నెట్టింట 5 మిలియన్లకుపైగా డిజిటల్ వ్యూస్ సాధించిన నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. వశిష్ఠ ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి కెరీర్‌లో టాప్-10 బెస్ట్ సినిమాల జాబితాలో టాప్-3లో ఉంటుందని తాజా వీడియోతో ఈజీగా అర్థమైపోతోంది. వశిష్ఠ కట్ చేసిన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ కోసం నెట్టింట ఫుల్ చర్చ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్.. ఈ వీడియోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. చిరు సినిమానా మజాకా అంటూ పోస్ట్ చేస్తున్నారు. హీరో లేకుండా ఉన్న గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం గ్రేట్ అని సినీ పండితులు చెబుతున్నారు. విశ్వంభర మూవీ ఆరంభమే అదిరిపోయిందని అంటున్నారు.
2023లో దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛ్ చేశారు మేకర్స్. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి పనిచేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయని ఇప్పటికే అప్డేట్ ఇచ్చేశారు కీరవాణి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీలో ఇతర నటీనటుల వివరాలను టీమ్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ చేస్తారని తెలుస్తోంది. దగ్గుబాటి రానా కూడా కీలకపాత్ర పోషిస్తారని టాక్ బయటికు వచ్చింది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత రానుంది. మరోవైపు, మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్ ను అందించడానికి మేమంతా సిద్దం.. అంటూ డైరెక్టర్ వశిష్ఠ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే క్యూరియాసిటీని తెగ పెంచుతున్నారు.