శనివారం డైరెక్టర్ ఆ హీరోని ట్రై చేస్తున్నాడా?
కానీ ఫలితం తారుమారైనా? అతడిపై నమ్మకంతో మరో అవకాశం రావడంతో శనివారం తో నిరూపించుకున్నాడు.
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 'సరిపోదా శనివారం'తో ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అంతకు ముందు అదే నానితో చేసిన 'అంటే సుందరానికీ' ప్లాప్ అయినా నాని నమ్మి అవకాశం ఇవ్వడంతో సాధ్యమైంది. తొలి ప్రయత్నం 'మెంటల్ మదిలో' యావరేజ్ గా ఆడింది. అటుపై చేసిన 'బ్రోచేవారు ఎవరురా' సోసోగా ఆడింది. దీంతో నాని సుందరం కథతో లాక్ చేసాడు.
కానీ ఫలితం తారుమారైనా? అతడిపై నమ్మకంతో మరో అవకాశం రావడంతో శనివారం తో నిరూపించుకున్నాడు. తాజాగా వివేక్ ఆత్రేయ విజయ్ దేవరకొండ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. తాజా సక్సెస్ పట్టుకుని దేవరకొండని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడుట. రెడీగా స్టోరీ లైన్ ఉందిట. వినిపించాలని ట్రై చేస్తున్నాడుట. స్టోరీ నచ్చితే దేవరకొండ కమిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో విజయ్ ముందుంటాడు. విజయ్ పేరుతో వెలుగులోకి వచ్చిన మేకర్స్ కొంత మంది ఉన్నారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు? అన్నది క్లారిటీ లేదు. ఇంతవరకూ ఏ దర్శకుడికి డేట్లు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ ముందుగానే కర్చీప్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే విజయ్ కి సక్సెస్ కూడా అంతే కీలకం. గత రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇదే తదుపరి కొనసాగితే అది మార్కెట్ పైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపత్యంలో స్టోరీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కొత్త సినిమా కమిట్ మెంట్లు ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఇదే.