రామ్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!
అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ కి జోడీగా భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది. యంగ్ మేకర్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా రామ్ కోసం సంగీత ద్వయాన్నే దింపుతున్నారు.
వివేక్-మెర్విన్గా ప్రసిద్ధి చెందిన వివేక్ శివ -మెర్విన్ సోలమన్ల ప్రతిభావంతులైన సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఇద్దరు తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు. ఇప్పటివకే ఓ పదిహేను సినిమాలకు సంగీతం అందించారు. ధనుష్, విజయ్ సేతుపతి, నయనతార, త్రిష నటించిన చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించి ఫేమస్ అయ్యారు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మరింత బిజీ అవుతున్నారు. విజయ్ ఆంటోనీ నటించిన చిత్రాలకు సంగీతం..ఆర్ ఆర్ ఆందించి ఫేమస్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే మైత్రీమూవీ మేకర్స్ ఈ సంగీత ద్వయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాకి ఇంత వరకూ పనిచేయలేదు. తొలిసారి రామ్ సినిమాకి పని చేయడం విశేషం. మరి ఎలాంటి బీట్స్ ఇస్తారో చూడాలి. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు 2012లోఅంబూలీ సినిమాతో లాంచ్ అయ్యారు. తర్వాత జై హీరోగా నటించిన వడకర్రీకి సంగీతం అందించారు. అటుపై త్రిష నటించిన మోహనీ, నయనతార నటించిన డోరా చిత్రాలకు సంగీతం అందించారు.
ఆ రెండు హారర్ చిత్రాలకు వైవిథ్యమైన సంగీతాన్ని అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ధనుష్ హీరోగా నటించిన పటాస్ చిత్రానికి వీళ్లే సంగీతం అందిచారు. అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి. స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్ లు చేస్తున్నారు.