16 ఏళ్ల‌కే షేర్ మార్కెట్ ఫార్ములా ప‌ట్టేసిన హీరోకి ఇదొక లెక్కా?

వివేక్ తన తల్లిదండ్రులు - సురేష్- యశోధర - భార్య ప్రియాంకతో కలిసి కారును డెలివ‌రీ తీసుకోవడానికి సిద్ధమవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా దీనికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

Update: 2024-11-26 12:30 GMT

`ర‌క్త చ‌రిత్ర`లో ప‌రిటాల ర‌వి పాత్ర‌లో న‌టించి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ వివేక్ ఒబెరాయ్ .. అడ‌పాద‌డ‌పా సౌత్ లో విల‌న్ పాత్ర‌ల్లోను మెరిసాడు. అయితే ఒబెరాయ్ ఇటీవ‌ల కొంత కాలంగా సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు. అయినా కానీ అత‌డి విలాసాల‌కు కొద‌వేమీ లేదు. తాజాగా వివేక్ ఒబెరాయ్ తన గ్యారేజీకి విలాసవంతమైన కార్‌ను జోడించారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్‌కు యజమాని అయ్యాడు. ఈ కార్ ను డెలివరీ తీసుకుంటున్న వీడియోను వివేక్ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా దానిపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

వివేక్ తన తల్లిదండ్రులు - సురేష్- యశోధర - భార్య ప్రియాంకతో కలిసి కారును డెలివ‌రీ తీసుకోవడానికి సిద్ధమవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా దీనికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సిల్వర్ గ్రే రోల్స్ రాయిస్ కుల్లినన్‌ను అత‌డు గ్యారేజీకి తెచ్చాడు. భారతదేశంలో ఈ కారు ధర రూ.10.50 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆన్ రోడ్ టాప్ మోడల్ ధర రూ.12.25 కోట్లు. వివేక్ ఈ వీడియోకి ఒక అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చారు. విజయం వివిధ ఆకారాలు .. పరిమాణాలలో వస్తుంది.. ఈ రోజు అది ఇలా ఉంది. జీవితంలోని ప్రత్యేక క్షణాలను కుటుంబంతో జరుపుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు .. అని రాసాడు.

ఈ వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కారు రాగానే వివేక్ తన తండ్రి, నటుడు సురేష్ ఒబెరాయ్‌కి కీస్ అందజేసి, అతను స్వయంగా ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు. కార్ తీయ‌మ‌ని త‌న తండ్రిని కోరాడు. వివేక్ కారు లోపల నుండి ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. కెమెరాకు థంబ్స్ అప్ ఇస్తూ, అతని కుటుంబం రియాక్ష‌న్స్ ని కూడా రికార్డ్ చేశాడు. ఈ వీడియోపై ప‌లువురు స్పందించారు. అతడు (తన) తండ్రిని ఎలా గౌరవిస్తాడో చూడటం చాలా బాగుంది అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు.

వివేక్ చివరిసారిగా 2019లో `పీఎం నరేంద్ర మోదీ- ప్రైమ్ మినిస్టర్‌` అనే బయోపిక్‌లో నటించాడు. ఆ త‌ర్వాత మలయాళం, కన్నడ, త‌మిళం, తెలుగు చిత్రాలలో కనిపించాడు. ముఖ్యంగా లూసిఫర్, కడువ చిత్రాల్లో అత‌డి న‌ట‌న‌కు పేరొచ్చింది. వివేక్ మూడు వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు - ఇన్‌సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ వంటి సినిమాల్లో క‌నిపించాడు. అయితే ఇటీవ‌ల సినిమాలు త‌గ్గాయి. కానీ అత‌డి ఆదాయానికి డోఖా ఏం లేదు. ఒబెరాయ్స్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నారు. దీనికి తోడు టీనేజీ వ‌య‌సులోనే డ‌బ్బు సంపాదన తెలిసిన హీరో వివేక్ ఒబెరాయ్. షేర్ మార్కెట్లో సునాయాసంగా ఆర్జించే నైపుణ్యం చిన్న ఏజ్ లోనే నేర్చుకున్నాడు. మార్కెట్ లో చాలా సంపాదించాన‌ని అత‌డు ఇంత‌కుముందు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అత‌డు సినిమాలు చేయ‌క‌పోయినా సంపాదించ‌గ‌ల‌డు. కేవ‌లం 12కోట్ల‌తో ల‌గ్జ‌రీ కార్ కొన‌డం అత‌డికి పెద్ద మ్యాట‌ర్ కాదు. కానీ అత‌డి నైపుణ్యం అనుభ‌వం ఎలాంటివో తెలియ‌ని వారు .. సినిమాల్లేక‌పోయినా ల‌గ్జ‌రీ కార్లు కొంటున్నాడంటూ కామెంట్ చేయ‌డం కించ‌ప‌ర‌చ‌డం స‌రికాదు!

Tags:    

Similar News