పాములకు ఐదు రోజుల పాటు ఆడిషన్!
అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోన్న టాప్ డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు అవసరం మేర హీరోలను కూడా ఆడిషన్ చేస్తుంటారు.;

నటీనటుల విషయంలో ఆడిషన్ తప్పనిసరి. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు ఏ నటి సూటవుతుందో స్పష్టంగా తెలియని సందర్భంలో ఆడిషన్ చేసి తీసుకుటారు. హీరో అయినా? హీరోయిన్ అయినా? ఇతర నటీనటులైనా ఈ విధానం చాలా సందర్భాల్లో అమలవుతుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో మాత్రం తప్పని సరిగా పాటిస్తుంటారు. కాంబినేషన్లు సెట్ అయిన సందర్భంలో మాత్రమే హీరోయిన్ల ఎంపికపై ఆడిషన్ ఉండదు.
అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోన్న టాప్ డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు అవసరం మేర హీరోలను కూడా ఆడిషన్ చేస్తుంటారు. ఇంకా సినిమాల్లో ఏవైనా జంతువుల్ని ఎంపిక చేయాలన్నా? అవ సరం వాటికి కొంత ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. ఇది చాలా రేర్ గా జరుగుతుంటుంది. పాములు..ఇతర సరిసృపాలు లాంటి వాటిని పెట్టాలనుకుంటే? మాత్రం చాలా వరకూ గ్రాఫిక్స్ కి వెళ్లిపోతుంటారు.
వాస్తవ సరిసృపాల జోలికి వెళ్లరు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఏకంగా పాముల్ని కూడా ఆడిషన్ చేసి సర్ ప్రైజ్ చేసాడు. అవును పాముల్ని ఆడిషన్ చేసి మరీ తన సినిమాకి ఎంపిక చేసాడు. ఎవరా డైరెక్టర్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వి.ఎన్ ఆదిత్య 'ఫణి' అనే ఓ గ్లోబల్ చిత్రాన్ని తెరక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈ చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటులతో పాటు ఓ పాము కూడా నటించినట్లు తెలిపారు.
దీనిలో భాగంగా 20 పాముల్ని తీసుకొచ్చి వాటిలో ఐదింటిని ఎంపిక చేసి వాటికి ఆడిషన్ చేసారుట. అందులో ఓ పామును సినిమా కోసం తీసుకున్నారుట. సినిమాలో ఆ పాము కీలక పాత్ర పోషించిందిట. పాము సినిమా అని ఇది భక్తి నేపథ్యం గల చిత్రం కాదని మంచి కమర్శియల్ చిత్రమని తెలిపారు. దీంతో పాము పాత్రపై క్యూరియాసిటీ నెలకొంది.