గూఢచారి 2: సీక్రెట్ మిషన్ లో టాలెంటెడ్ బ్యూటీ

తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

Update: 2025-01-07 07:01 GMT

అడివి శేష్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గూఢచారి 2’. ‘గూఢచారి’కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి అడివి శేష్ కథ అందించారు. పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతోన్న ఈ ప్రాజెక్ట్ ని మొదటి సినిమా కంటే మూడు రేట్లు ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీపుల్స్ మీడియాతో పాటుగా అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇందులో భాగం కావడం విశేషం.


కచ్చితంగా అడివి శేష్ ‘గూఢచారి 2’తో కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాడని అనుకుంటున్నారు. మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. అయితే కొన్ని కీలక పాత్రల కోసం కొంతమంది టాలెంటెడ్ నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అడివి శేష్ తో కలిసి ఆమె ఉన్న ఫోటోని షేర్ చేసి అఫీషియల్ గా వామికా ఈ చిత్రంలో భాగమైనట్లు చెప్పారు.

ఫీమేల్ లీడ్ కోసమే ఆమెని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2007లోనే నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన వామిక గబ్బి ఆరంభంలో సైడ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చేది. తరువాత లీడ్ యాక్టర్ గా మారింది. తెలుగులో ఆమె సుధీర్ బాబుకి జోడీగా ‘భలే మంచి రోజు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది. తరువాత తమిళంలో ఓ చిత్రంలో నటించింది.

అయితే ఈ బ్యూటీ ఎక్కువగా పంజాబీ, హిందీ సినిమాలలోనే నటిస్తోంది. రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయిన ‘బేబీ జాన్’ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్ గా చేసింది. అయితే ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఊహించని విధంగా ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ‘గూఢచారి 2’లో లీడ్ యాక్టర్ గా ఎంపిక కావడం విశేషం. కచ్చితంగా ఈ సినిమా ఆమెకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

అడివి శేష్ ఈ ప్రాజెక్ట్ పైన చాలా నమ్మకంతో ఉన్నారు. మేజర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న అడివి శేష్ ‘గూఢచారి 2’తో మరో గ్రాండ్ విక్టరీ అందుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే బాలీవుడ్ క్యాస్టింగ్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేస్తున్నారు. ఇక ‘గూఢచారి 2’ మూవీలో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’లో కూడా ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Tags:    

Similar News