కీర్తి (X) వామిక‌.. ఎవ‌రు ది బెస్ట్?

ప్ర‌చార వేదిక‌ల నుంచి తార‌ల ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

Update: 2024-12-21 04:12 GMT

వరుణ్ ధావన్ నటించిన 'బేబీ జాన్' చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. డిసెంబర్ 25న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో న‌టీన‌టులు బిజీగా ఉన్నారు. ప్ర‌చార వేదిక‌ల నుంచి తార‌ల ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.


కీర్తి ఓ వైపు.. వామిక గ‌బ్బి మ‌రోవైపు 'బేబి జాన్' ప్ర‌మోష‌న్స్ కోసం ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. అంతేకాదు.. వేదిక‌ల‌పై డ్రెస్‌సెన్స్ ప‌రంగాను ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ నెల‌కొంది. ఎవ‌రికి వారు ది బెస్ట్ గా క‌నిపించేందుకు ప్ర‌యత్నిస్తున్నారు. తాజా ఈవెంట్లో బేబి జాన్ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, వామిక గ‌బ్బి రెడ్ హా* లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. కీర్తి, వామిక ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ దుస్తుల కోసం క‌ళ్లు చెదిరే ధ‌ర‌ను చెల్లించార‌ని బాలీవుడ్ మీడియా వెల్ల‌డించింది.


కీర్తి అంద‌మైన ఎరుపు రంగు మిడీ డ్రెస్‌లో బ్యూటిఫుల్ గా క‌నిపించ‌గా, వామిక ఎరుపు రంగు లెద‌ర్ ట్రెంచ్ కోట్‌లో వైబ్రేంట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. కీర్తి హౌస్ ఆఫ్ సీబీ నుంచి 'అనైస్ స్కార్లెట్ శాటిన్ కోర్సెట్ మిడి'ని ధ‌రించింది. దీని విలువ 129 పౌండ్లు. ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు రూ.14000. అలాగే వామికా క్యువా క్లాతింగ్ నుంచి డ్రాగన్ రెడ్ ఫాక్స్ లెదర్ ట్రెంచ్ కోట్ ను ధరించారు. దీని విలువ సుమారు రూ.9000. ఈ కొత్త‌ లుక్స్ చూశాక‌.. కీర్తి వ‌ర్సెస్ వామిక‌.. ఎవ‌రు ది బెస్ట్? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో డిబేట్ న‌డిపిస్తున్నారు.

కలీస్ దర్శకత్వం వహించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ 'బేబి జాన్' అట్లీ 2016 తమిళ హిట్ 'తేరి'కి రీమేక్. ఈ చిత్రంలో వరుణ్ ప్రధాన క‌థానాయ‌కుడు. కీర్తి , వామికా గబ్బి, జరా జియాన్నా, జాకీ ష్రాఫ్ త‌దిత‌రులు న‌టించారు. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం వరుణ్ ఈ సినిమా కోసం 25 కోట్లు వసూలు చేయగా, కీర్తి సురేష్ రూ. 4 కోట్లు అందుకుంది. జాకీ ష్రాఫ్ కోటిన్న‌ర‌, రాజ్‌పాల్ యాదవ్ కోటి అందుకున్నారు. వామికా గబ్బి పాత్రకు రూ.40 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పారితోషికం వసూలు చేయకుండా అతిధి పాత్రలో నటించారు.

Tags:    

Similar News