వెబ్ సిరీస్ కోసం 200 కోట్లా? ఇది సంచలనమే!
పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ గురించి చెప్పాల్సిన పనలేదు. వందలకోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేస్తు న్నారు.
పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ గురించి చెప్పాల్సిన పనలేదు. వందలకోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేస్తు న్నారు. సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్నది తర్వాత సంగతి ముందు ఆ సినిమాని ప్రతిష్టా త్మకంగా నిర్మించామా? లేదా? అన్నది హైలైట్ అవుతుంది. రీజనల్ మార్కెట్ సినిమా కోసమే 70-100 కోట్ల మధ్య పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ 200 కోట్లు దాటి పోతుంది.
అంతకు మిచి ఉంటుంది? తప్ప తగ్గడనికి ఛాన్స్ లేదు. కేవలం కంటెంట్ బేస్ట్ చిత్రాలైతే తప్ప..టెక్నికల్ గా హైలైట్ చేయాలంటే? కోట్లు పోయాల్సిందే. థియేటర్ ..ఓటీటీ..శాటిలైట్..డబ్బింగ్ రైట్స్ ఇలా ఇన్ని రకాల కోణాల్లో బిజినెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి థియేట్రికల్ రిలీజ్ అంటే? బడ్జెట్ పెద్ద ఫిగరే కనిపిస్తు ది. ఇక వెబ్ సిరీస్ ల కోసమైతే నిర్మాణ సంస్థలు..మేకర్స్ అంతగా ఖర్చు చేయడం లేదు.
అక్కడ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే? నిర్మాణ సంస్థలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావు. కానీ కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంటే బడ్జెట్ విషయంలో పెద్ద తెరకు ధీటుగానే ఓటీటీలోనూ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భన్సాలీ `హీరామండి`తో వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
ఈసీరిస్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో `హీరామండి`ని విజువండర్ గా అద్భుతంగా మలుస్తున్నట్లు కనిపిస్తోంది. మరి హీరామండి బడ్జెట్ ఎంత? అంటే 200 కోట్లకు పైగానే అని తెలిసింది. దీంతో వెబ్ సిరీస్ ల్లో ఇది సంచలనంగా మారింది. ఇంతవరకూ ఏ వెబ్ సిరీస్ ఇంత ఖర్చుతో నిర్మాణం అవ్వలేదు. ఇండియాలో తెరకెక్కించిన ఏసీరిస్ కి 50 కోట్లు మించ లేదు. సీటాడెల్ కోసం హాలీవుడ్ నిర్మాతలు రెండు వేల కోట్లు పెట్టారు. కానీ ఇండియన్ వెర్షన్ వచ్చేసరికి అది చాలా తక్కువ బడ్జెట్ తో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు.