ఆ రెండు సిరీస్‌లను క‌లిపే క్రాస్ ఓవ‌ర్ స్టోరి?

మనోజ్ బాజ్‌పేయి న‌టించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'.. షాహిద్ కపూర్ 'ఫర్జీ 2' మధ్య క్రాస్‌ఓవర్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Update: 2024-05-26 15:30 GMT

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే క్రియేటివిటీ అసాధార‌ణ‌మైన ప‌నిత‌నంపై ప్ర‌జ‌ల‌కు విప‌రీత‌మైన గురి కుదిరింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లుగా వారు అసాధార‌ణ ప్ర‌జ్ఞ‌తో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. థ్రిల్లింగ్ గ్రిప్పింగ్ కంటెంట్ ని అందించ‌డంలో ప‌నిమంతులు అని నిరూపించారు. వారి నుంచి వ‌చ్చిన‌వే ఫ్యామిలీమ్యాన్ సిరీస్.. ఫ‌ర్జీ సిరీస్. అందుకే వీటి నుంచి క్రాస్ ఓవ‌ర్ వస్తుంద‌ని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు.

మనోజ్ బాజ్‌పేయి న‌టించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'.. షాహిద్ కపూర్ 'ఫర్జీ 2' మధ్య క్రాస్‌ఓవర్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దర్శకులు రాజ్ అండ్ డికె మ‌రోసారి మైండ్ బ్లోయింగ్ డ్రామాలతో మాయా ప్రపంచాన్ని సృష్టిస్తార‌ని ఆశిస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల న‌డుమ ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఎట్టకేలకు ఫర్జీ 2 - ది ఫ్యామిలీ మ్యాన్ 3 క్రాస్‌ఓవర్ అవకాశంపై తన మౌనాన్ని వీడారు. పాపుల‌ర్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో ప్రత్యేక చాట్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రధారి అయిన‌ మనోజ్ బాజ్‌పేయి రెండు సిరీస్ ల మధ్య క్రాస్‌ఓవర్ కి ఉందా? అన్న ప్ర‌శ్న‌కు.. తాను ఆ వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేన‌ని తెలిపారు. ''అమెరికన్ కాంట్రాక్ట్ చాలా స్ట్రిక్ట్.. నేను ఏదైనా చెబితే తిరిగి కొంత మొత్తాన్ని నేను చెల్లించవలసి ఉంటుంది.. అందుకే ఏమీ చెప్పలేను'' అని అన్నారు. ఇది చాలా సర‌దాగా సాగుతోంది అంటూ వ్యాఖ్యానించారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 3లో శ్రీకాంత్ తివారీ పాత్రలో క‌నిపించ‌డంపైనా ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పేయిని అడిగారు. ఇంత‌కుముందు ఈ సిరీస్ నుంచి తొలి షెడ్యూల్ పూర్త‌యింద‌ని, మిడ్ నైట్ వ‌ర‌కూ షూట్లు ఉన్నాయ‌ని కూడా తెలిపారు. ఫ్యామిలీ మ్యాన్ 3ని రాజ్ & డికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీ పాత్రను పోషిస్తున్నారు. మధ్యతరగతి వాడైన తివారీ ప్రపంచ స్థాయి గూఢచారి కావ‌డ‌మే ఈ ట్విస్ట్. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మనోజ్ తన త‌దుప‌రి చిత్రం 'భయ్యా జీ' కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇది 24 మే 2024న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News