బన్నీ ఎక్కడ? సోలో ట్రిప్ లో ఉన్నాడా?
పుష్ప సీక్వెల్ కోసం మూడేళ్ల పాటు స్పెండ్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఫ్యామిలీతో గడుపుతున్నారు.;

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్న విషయం తెలిసిందే. పుష్ప-2 ది రూల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ మూవీ షూటింగ్ ను ఇంకా స్టార్ట్ చేయలేదు. పుష్ప సీక్వెల్ కోసం మూడేళ్ల పాటు స్పెండ్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఫ్యామిలీతో గడుపుతున్నారు. భార్యాపిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా గడ్డం తీసేసి యంగ్ అండ్ గుడ్ లుక్ లో కనిపిస్తున్నారు బన్నీ. కొద్ది రోజుల క్రితం అస్సాంలోని నేషనల్ పార్క్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేశారు. నమేరి నేషనల్ పార్క్ అని అప్పట్లో స్నేహా రెడ్డి పోస్ట్ చేశారు. అర్హ, అయాన్, బన్నీ, స్నేహా .. నలుగురు ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
ఇక రీసెంట్ గా అల్లు అర్జున్.. తన సినిమా వర్క్ పై దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు గాను రెండు వారాలకు పైగా అల్లు అర్జున్.. దుబాయ్ లో ఉన్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బన్నీ.. అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు అక్కడ ఉండనున్నారని సమాచారం. ఫ్యామిలీతో కాకుండా.. సింగిల్ గా వెళ్లారని టాక్ వినిపిస్తోంది. అక్కడ కొన్ని టూరిస్ట్ స్పాట్స్ కు వెళ్లి చిల్ అవ్వనున్నారని వినికిడి. ఆ తర్వాత వచ్చి తన మూవీ వర్క్స్ తో బిజీ అవ్వనున్నారట.
అయితే అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ రాకపోయినా.. అంతా ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన బన్నీ బర్త్ డే కనుక.. అప్పుడు మేకర్స్ సినిమాను ప్రకటించనున్నారట.
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్.. బన్నీ-అట్లీ మూవీ నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉందన్న విషయం తెలిసిందే. ఆ చర్చలు కూడా జరుగుతున్నాయని, త్వరలో ప్రకటన రానుందని తెలుస్తోంది. మరికొందరు దర్శకులు కూడా బన్నీని రీసెంట్ గా సంప్రదించినట్లు సమాచారం. కాబట్టి బన్నీ అప్ కమింగ్ సినిమాల అనౌన్స్మెంట్లు వరుసగా రానున్నాయన్నమాట.