ఎకో-ఫ్రెండ్లీగా 'జరగండి'.. 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే?

సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2025-01-02 13:04 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''గేమ్ ఛేంజర్''. దిల్ రాజు ప్రొడక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి నాలుగు పాటలను విడుదల చేసారు. ఎస్. థమన్ కంపొజిషన్ లో వచ్చిన ఈ సాంగ్స్ అన్నీ, శంకర్ శైలిలో గ్రాండ్ స్కేల్ లో వేటికవే ప్రత్యేకంగా షూట్ చేయబడ్డాయి.

'గేమ్ ఛేంజర్' సినిమా మేకింగ్ కి ₹ 300 కోట్లకు పైగానే బడ్జెట్ అయింది. అందులో ₹ 75 కోట్లు కేవలం ఈ నాలుగు పాటల చిత్రీకరణ కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. 'జరగండి' పాటను తీసుకుంటే, 70 అడుగుల భారీ హిల్ విలేజ్ సెట్ లో గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ తో రూపొందించారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ను 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ - కియారా అద్వానీతో పాటుగా 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. వీరంతా కూడా జ్యూట్ (జనపనార)తో తయారు చేసిన ఎకో-ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం.

'రా మచ్చా మచ్చా' పాటని ఇండియా ఫోక్ డ్యాన్స్ కి ట్రిబ్యూట్ గా చిత్రీకరించారు. గణేష్ ఆచార్య మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసారు. చరణ్ తో పాటుగా 1000 మంది డ్యాన్సర్లతో సాంగ్ ను షూట్ చేసారు. ఇందులో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడాన్ని హైలైట్ చేసారు. అలానే న్యూజిలాండ్ లో రామ్ చరణ్ - కియారాల మీద తీసిన 'నానా హైరానా' గీతం అద్భుతమైన బ్యూటిఫుల్ మెలోడీ అనిపించుకుంది. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతం మిశ్రమంగా థమన్ ట్యూన్ కంపోజ్ చేసారు. ఇది ఇండియాలో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన మొట్టమొదటి పాటగా నిలిచింది.

'దోప్' సాంగ్ విషయానికొస్తే, ఇదొక హై ఎనర్జీ టెక్నో ఆంథమ్. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. రామ్ చరణ్ - కియారా తమ ఎనర్జిటిక్ స్టెప్పులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 100 మంది రష్యన్ డ్యాన్సర్లతో 8 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఇటీవల యూఎస్ లో నిర్వహించిన ఈవెంట్ లో ఈ సాంగ్ ను లాంచ్ చేసారు. ఇలా 'గేమ్ ఛేంజర్' సినిమాలోని నాలుగు పాటలు కూడా ఏదొక స్పెషాలిటీ కలిగి ఉన్నాయి. శంకర్ గత చిత్రాల మాదిరిగానే విజువల్ గ్రాండియర్ గా, భారీ బడ్జెట్ తో ఈ సాంగ్స్ ని రూపొందించారని అర్థమవుతోంది. కేవలం నాలుగు పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేసారంటే, బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతిని పంచుతాయనే ఆసక్తి రెట్టింపు అవుతోంది.

శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ''గేమ్ ఛేంజర్'' సినిమా తెరకెక్కుతోంది. దీనికి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. ఇందులో రామ్ చరణ్ తండ్రీకొడులుగా నటించారు. కియారా, అంజలి హీరోయిన్లుగా నటించగా.. ఎస్.జె సూర్య విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని, సునీల్, నవీన్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తిరు, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సమీర్ మహ్మద్, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News