వీల్‌చైర్‌లో చిన్నారి అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫుల్ ఖుష్
ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న చిన్నారి అభిమానిని చూసి బన్నీ చలించిపోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 67వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ వేడుకల్లో ఉన్నారు. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి ఈ పురస్కార వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ.. వీల్‌చైర్‌లో ఉన్న ఓ చిన్నారి అభిమాని కోసం బన్నీ చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
వివరాళ్లోకి వెళితే.. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. బన్నీ ఎక్కడ కనిపించినా.. అభిమానులు ఆటోగ్రాఫ్స్, సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అలానే తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అల్లు అర్జున్.
పలు సందర్భాల్లో తానే స్యయంగా అభిమానుల చెంతకు కూడా వస్తుంటారు. అయితే పుష్ప చిత్రంతో జాతీయ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ఆ అవార్డును అందుకునేందుకు తన భార్యతో కలిసి దిల్లీకి వెళ్లారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న చిన్నారి అభిమానిని చూసి బన్నీ చలించిపోయారు. తానే స్యయంగా ఆ చిన్నారి వద్దకు వెళ్లి సరదాగా ఆప్యాయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించారు.చిన్నారి పేరు, ఇతర వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. ఆటోగ్రాఫ్ ఇచ్చి షేర్ హ్యాండ్ కూడా ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన అభిమానలు ఆ వీడియోను తెగ షేర్ చేస్తూ లైక్స్, కామెంట్స్‌తో బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బన్నీ మనసు చాలా మంచిదని,ఫ్యాన్స్ కోసం ఆయన ఏదైనా చేస్తారని కొనియాడుతున్నారు.
కాగా, పుష్ప చిత్రంలో తన నటనకుగానూ బన్నీ ఏకంగా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పురస్కార వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు చిత్రసీమ నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు.