ప్రభాస్ 'రాజా సాబ్'.. రిలీజ్ సంగతేంటి?

ప్రభాస్‌ మొదటిసారి హారర్‌ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి ఫోకస్ రాజా సాబ్ పై ఉంది.

Update: 2025-01-25 13:07 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ మొదటిసారి హారర్‌ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి ఫోకస్ రాజా సాబ్ పై ఉంది.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌, సంజయ్‌ దత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న రాజా సాబ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు డైరెక్టర్ మారుతి ఓ ఈవెంట్ లో అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆల్మోస్ట్ లాస్ట్ కు షూటింగ్ చేరుకున్నట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తం పూర్తి కావడానికి 15-20 రోజులు పడుతుందని సమాచారం. ప్ర‌భాస్ ఇచ్చిన డేట్స్ బట్టి ఆయ‌న‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను త్వ‌ర‌లోనే షూట్ చేయ‌నున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేశారని వినికిడి.

అదే సమయంలో మూవీ అవుట్ పుట్ పట్ల నిర్మాతలు థ్రిల్లింగ్ గా ఉన్నారని తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ తోపాటు ప్రభాస్ లుక్స్ విషయంలో ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. దాంతోపాటు దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ద‌స‌రా సీజన్ అయితే సెల‌వులు బాగా క‌లిసొస్తాయని.. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా బాగుంటుంద‌ని రాజా సాబ్ మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మే 16వ తేదీన విడుదల చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.

ఇప్పుడు దసరా సీజన్ లో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కుదిరితే సమ్మర్.. లేకుంటే దసరా అన్న భావనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజా సాబ్ రిలీజ్ పై ఇంకా మేకర్స్ ఒక డెసిషన్ కు రాలేదని సమాచారం. త్వరలోనే మేకర్స్ మరో అప్డేట్ తో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News