ధనుష్, నాగార్జున ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా ఫిబ్రవరిలో విడుదల కావడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది.
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం ప్రకటించబడిన సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ చాలా ఆలస్యంగా షూటింగ్ ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా సినిమా షూటింగ్ జరిగిందా అంటే అదీ లేదు. చాలా కాలం పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆ మధ్య ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా ఫిబ్రవరిలో విడుదల కావడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. అందుకే విడుదల తేదీ మార్చే యోచనలో ఉన్నారు.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేరా సినిమాను ఫిబ్రవరిలో తీసుకు వచ్చే ఉద్దేశంతో లేరని, ఆయన సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. సినిమాకు కొంత మేరకు షూటింగ్ ఉంది. అంతే కాకుండా సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో ఉంది. కనుక కుబేరా సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఒకటి రెండు వారాల్లో ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ టాలీవుడ్ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ఆయన హీరోగా తమిళ్‌లో రూపొందుతున్న ఇతర సినిమాలు సైతం అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా విడుదల అవుతున్నాయి. కానీ శేఖర్ కమ్ముల కుబేరా విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు అంటూ ధనుష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తమిళ్‌లోనూ రూపొందిస్తున్న కారణంగా ఆలస్యం అవుతుంది అంటూ కొందరు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది అధికారికంగా శేఖర్ కమ్ముల చెప్పాల్సి ఉంది.
ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల మార్క్ సినిమా ఇది అంటూనే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమా అని, మంచి కంటెంట్ ఉండే సినిమా ఇది అంటూ ధీమాగా చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉండే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈ నెలలో పూర్తి చేస్తారా లేదంటే వచ్చే నెల వరకు కొనసాగిస్తారా అనేది చూడాలి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.