ధనుష్‌కి జాబిలమ్మను చూపించే ఉద్దేశం లేదా..?
తమిళ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయని బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.;
హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడు తన దర్శకత్వంలో సినిమాలను తీసుకు వస్తున్న ధనుష్ ఇటీవల 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ధనుష్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే టైటిల్‌తో డబ్ చేశారు. తమిళ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయని బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. థియేటర్‌లో చూడని ప్రేక్షకులు, అక్కడ ఆసక్తి చూపించని ప్రేక్షకులు చాలా మంది ఓటీటీ ద్వారా సినిమాను స్ట్రీమింగ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు.
'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం' సినిమాను పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళ్ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ధనుష్ అభిమానులతో పాటు ప్రేమ కథలను ఇష్టపడే వారు అమెజాన్‌లో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అనగానే చాలా మంది తెలుగు ప్రేక్షకులు సైతం జాబిలమ్మ నీకు అంత కోపమాను తెలుగులో చూడడం కోసం ప్రయత్నించారు. కానీ అమెజాన్‌లో తెలుగు వర్షన్‌ను అందుబాటులో ఉంచలేదు. అమెజాన్ ప్రైమ్ సాధారణంగా ఒక సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేస్తే ఇతర భాషల్లోనూ డబ్బింగ్ వర్షన్‌లను అందుబాటులో ఉంచుతుంది.
జాబిలమ్మ నీకు అంత కోపమా తెలుగు వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్‌కి ఇవ్వలేదని తెలుస్తోంది. తమిళ్ వర్షన్ మాత్రమే అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి అవకాశం ఉంది. తెలుగు స్ట్రీమింగ్ హక్కులను సింప్లీ సౌత్ అనే ఓటీటీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఓటీటీ పేరును పెద్దగా వినలేదు. ఇతర భాషల కంటెంట్ ఈ ఓటీటీలో ఎక్కువగానే ఉంది కానీ తెలుగు కంటెంట్ చాలా తక్కువగా ఉంది. దాంతో తెలుగు వారిలో ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చాలా తక్కువ మందిలో ఉండి ఉంటుంది. కనుక జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ మంది చూసే అవకాశాలు లేవు. ఈ సినిమాను తెలుగు వారికి ఓటీటీ ద్వారా చూపించే ఉద్దేశం లేక ధనుష్ ఇలా సింప్లీ సౌత్‌కి ఇచ్చాడా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం' సినిమాతో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే అయినా నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. లుక్ పరంగా ధనుష్‌ని దించాశాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. నటుడిగా పవిష్‌కి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో తమిళ ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్నారు. యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా క్యూట్ లవ్ స్టోరీస్‌తో ఈ సినిమాను ధనుష్ రూపొందించాడు. ఇలాంటి సింపుల్ కథతో సినిమాలను తీయొచ్చా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. ధనుష్ లవ్ స్టోరీల మేకింగ్‌లోనూ కింగ్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.