బిగ్ బాస్ 8 : ఆ కంటెస్టెంట్ పై వైల్డ్ కార్డ్స్ ఎటాక్..!
ఐదు వారాల అనంతరం ఎనిమిది మంది హౌస్ మేట్స్ హౌస్ లో ఉండగా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా వెళ్లారు.
బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా కూడా షోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఐదు వారాల అనంతరం ఎనిమిది మంది హౌస్ మేట్స్ హౌస్ లో ఉండగా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా వెళ్లారు. ఐతే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా ఇదివరకు బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారే వచ్చారు. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు జరిగిన బిగ్ బాస్ లో పాల్గొన్న వారిలో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి వచ్చారు.
ఐతే ఈ వైల్డ్ కార్డ్స్ సోమవారం నామినేషన్స్ లో కేవలం ఒక కంటెస్టెంట్ మీదే ఫోకస్ చేశారని అనిపిస్తుంది. నామినేషన్స్ లో భాగంగా వైల్డ్ కార్డ్స్ అంతా కూడా ఓజీ క్లాన్ లోని యష్మిని అందరు టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆమె మణికంఠ మీద చూపిస్తున్న హెసిటేషన్ కారణం చెప్పి ఆమెను నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే హరితేజ, మెహబూబ్, గౌతం కృష్ణ ఇలా అనరు యష్మిని నామినేట్ చేశారు.
మణికంఠ మీద ఆమె చేస్తున్న ఆరోపణలు.. అతన్ని టార్గెట్ చేసినట్టుగా ఉందని బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ చెబుతున్నారు. ఐతే యష్మి మాత్రం మణికంఠ విషయంలో ఆమె చేసిన దాన్ని ఇప్పటికీ సమర్ధించుకుంటుంది. నామినేషన్స్ అనంతరం బయట చూడటం కాదు హౌస్ లో మణికంఠ చేస్తున్న విషయాలను చూస్తే వారికే అర్థమవుతుంది అన్నది.
వైల్డ్ కార్డ్స్ అంతా కూడా యష్మి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో యష్మి, పృధ్వి, సీత, విష్ణు ప్రియ రెండు లేదా దానికి మించి నామినేషన్స్ పడ్డాయి. సో ఈ ముగ్గురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నట్టే. మణికంఠకు టేస్టీ తేజ ఒక్కడే నామినేషన్ వేశాడు. మరొకరు కూడా మణికంఠకు వేస్తే అతను కూడా నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి తన ఆట తీరు కన్నా మాట తీరుతో మెప్పిస్తూ వస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో విష్ణు ప్రియ, యష్మి ఇద్దరు డేంజర్ లో ఉండే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్స్ లో కూడా ఇద్దరిని నామినేట్ చేసినట్టు తెలుస్తుంది.