బిగ్ బాస్ 8 : ఓజీ వర్సెస్ రాయల్.. ఫైట్ గట్టిగానే..!

బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు ఆల్రెడీ బిగ్ బాస్ కు వచ్చిన కంటెస్టెంట్స్ నే మళ్లీ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ గా తీసుకొచ్చారు.

Update: 2024-10-07 07:13 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం వైల్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు ఆల్రెడీ బిగ్ బాస్ కు వచ్చిన కంటెస్టెంట్స్ నే మళ్లీ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ గా తీసుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎనిమిది మంది వచ్చారు. వారిని రాయల్ క్లాన్స్ గా నాగార్జున ఫిక్స్ చేశారు. హౌస్ లోకి వెళ్లేప్పుడే వైల్డ్ కార్డ్స్ తో ఓజీ అంటూ హౌస్ లో ఈ ఐదు వారాలు ఉన్న కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు పెట్టాడు.

నాలుగు టాస్క్ లు పెట్టగా అందులో రెండు ఓజీ గ్యాంగ్, రెండు రాయల్ క్లాన్ గెలిచింది. ఐతే గంగవ్వ, అవినాష్ చేసిన బాల్ టాస్క్ లో గంగవ్వ అదరగొట్టి తాను కూడా పోటీలో నిలబడి తీరుతా అని ప్రూవ్ చేసుకుంది. ఇక సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ తెలిసిందే. ఒక్కరోజులోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆట చూడలేం కాబట్టి బిగ్ బాస్ వారిలో నుంచి ఇద్దరినే నామినేట్ చేయాలని చెబుతాడు.

ఇక ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తమ ఆటని చూసిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తారు. ఈ వీక్ నామినేషన్స్ లో యష్మి, విష్ణు ప్రియ, సీతకు ఎక్కువమంది నామినేషన్స్ వేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఓజీ వర్సెస్ రాయల్ క్లాన్స్ మధ్య గట్టి ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. ఐతే హౌస్ లోకి వెళ్లిన అవినాష్ ఆల్రెడీ తన డ్యూటీగా కామెడీ పంచుతున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 8 మండే ప్రోమో రిలీజైంది. అందులో అవినాష్ చేత అందరు డిష్ వాష్ చేయిస్తున్నారు. నయని పావని, మణికంఠ అతనికి హెల్ప్ చేస్తున్నారు. చంద్రముఖి సినిమాలో తోం తోం తోం పాట పాడుతూ వాళ్లు బాసిన్లు తోముతున్నారు. అవినాష్, టేస్టీ తేజ తో పాటు రోహిణి కూడా హౌస్ లో ఉంది కాబట్టి కామెడీ అదిరిపోతుందని చెప్పొచ్చు. సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూస్తుంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అనిపించేలా ఉంది.

Tags:    

Similar News