2025 లోనూ అక్క‌డంత స్పీడ్ లేదా!

అలాగే మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ అయితే ఏకంగా రెండేళ్ల‌గా సినిమాల‌కే దూరంగా ఉంటున్నారు.

Update: 2024-12-12 15:30 GMT

బాలీవుడ్ 2025లోనూ వీక్ గానే క‌నిపిస్తుందా? భారీ రిలీజ్ లంటూ పెద్ద‌గా లేవా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపి స్తుంది. షారుక్ ఖాన్ గ‌త ఏడాది 'ప‌ఠాన్', 'జ‌వాన్', 'డంకీ' చిత్రాల‌లో అల‌రించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క చిత్రం కూడా రాలేదు. ఇక స‌ల్మాన్ ఖాన్ ఈ ఏడాది ఒక్క సినిమాతోనూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది లేదు. 'బేబి జాన్', 'సింగం ఎగైన్' లో మాత్రం గెస్ట్ అపిరియ‌న్స్ ఇచ్చారు. అలాగే మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ అయితే ఏకంగా రెండేళ్ల‌గా సినిమాల‌కే దూరంగా ఉంటున్నారు.

చివ‌రిగా 'లాల్ సింగ్ చ‌డ్డా'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత నిర్మాణం పై దృష్టి పెట్టారు త‌ప్ప న‌టుడిగా సినిమాలు చేయ‌లేదు. ఇక హృతిక్ రోష‌న్ కూడా స‌ల్మాన్ మార్గంలోనే న‌డుస్తున్నారు. 'విక్ర‌మ్ వేద' త‌ర్వాత 'టైగ‌ర్ 3'లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత గ్రీకువీరుడు నుంచి సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. మ‌రి వీళ్లంతా వ‌చ్చే ఏడాదైనా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తారా? అంటే ఒక‌రిద్ద‌రు త‌ప్ప మిగ‌తా వారంతా య‌ధావిధిగా మ్యూట్ లో ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది.

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'సికంద‌ర్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే ముర‌గ‌దాస్ కి ఈ మ‌ధ్య కాలంలో స‌క్సెస్ లేవు. చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాకి పెద్ద‌గా బ‌జ్ క్రియేట్ అవ్వ‌లేదు. రిలీజ్ వ‌ర‌కూ గానీ ఈసినిమాపై అంచ‌నాలు క్రియేట్ అయ్యే అవ‌కాశం లేదంటున్నారు. రిలీజ్ త‌ర్వాత వ‌చ్చే టాక్ ని బ‌ట్టే సినిమా స‌త్తా తెలుస్తుందంటున్నారు. ఇక హృతిక్ రోష‌న్ హీరోగా ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో 'వార్ -2' తెర‌కెక్కుతోంది.

భారీ అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న చిత్ర‌మిది. అయితే ఇందులో తెలుగు హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా న‌టిస్తున్నాడు. దీంతో క్రెడిట్ అంతా హృతిక్ కే చెంద‌దు. ఆ ర‌కంగా సినిమాకి ఓ ర‌కంగా ఇది మైన‌స్. అజ‌య్ దేవ‌గ‌ణ్, అక్ష‌య్ కుమార్ లాంటి న‌టుల సినిమాలు రిలీజ్ అయినా అవి బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ సినిమాలు కాదు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ల నుంచి ఎలాంటి సినిమాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కావు.

Tags:    

Similar News