ఎస్ ఎస్ ఎంబీ 29 ఏడాదిన్నర తర్వాతే!
అయితే రిలీజ్ మాత్రం ఏడాదిన్న తర్వాతే ఉంటుందని తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ చెప్పారు.
ఎస్ ఎస్ ఎంబీ 29 రాజమౌళి దర్వకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు? ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? అంటే మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే రిలీజ్ మాత్రం ఏడాదిన్న తర్వాతే ఉంటుందని తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ చెప్పారు.
'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ లో భాగంగా ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ ఎప్పుడో చెప్పగలరా? అంటే రామ్ చరణ్...రాజమౌళి అనుమతి లేకుండానే ఏడాదిన్నర తర్వాతే ఉంటుందని అంచనగా చెప్పారు. ఆ సమయంలో రాజమౌళి పక్కనే ఉన్నారు. కానీ ఆయన్ని ఈయన అడగలేదు. దీంతో చరణ్ గెస్ చేసింది కరెక్టే అంటూ రాజమౌళి ముందుకొచ్చారు. అంటే ఆ సినిమా గురించి 2026 మిడ్ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.
రాజమౌళి సినిమా షూటింగ్ అంటే ఆ మాత్రం సమయం తప్పనిసరి. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలు అలా రిలీజ్ అయినవే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి రామ్ చరణ్..రాజమౌళితో పని చేసిన అనుభవం ఉండటంతో రిలీజ్ విషయంలో అలా ఓ అంచనాకి వచ్చారు. మరి ఈ గెస్సింగ్ నైనా జక్కన్న రుజువు చేస్తారా? లేదా? అన్నది చూడాలి. కాబట్టి సూపర్ స్టార్ మహేష్ అభిమానులు 2026 మిడ్ వరకూ ఆ సినిమా గురించి ఆలోచించే పనిలేదు.
జక్కన్న చిత్రం పట్టాలెక్కిందంటే? అప్ డేట్స్ కూడా ఏమీ రావు. కామ్ గా పూర్తి చేసి అంతా ఒకే అనుకుంటేనే జక్కన్న సినిమా గురించి అప్ డేట్ ఇచ్చేది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల అప్ డేట్ విషయంలో ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. అలాగే రిలీజ్ తేదీల విషయంలోనూ ఎన్నో రకాల మార్పులు జరిగిన సంగతి తెలిసిందే.