యంగ్ హీరోకి పోటీగా మెగాస్టార్ !

తొలి సినిమా 'హ‌నుమాన్' కూడా సోషియా ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అవ్వ డంతో పెద్ద విజ‌యం సాధించింది.

Update: 2025-01-04 23:30 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఎన్నో చిత్రాల్లో తేజ స‌జ్జా చిరంజీవి చైల్డ్ హుడ్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తేజ యంగ్ హీరోగా మారి సినిమాలే చేస్తున్నాడు. 'హ‌నుమాన్' విజ‌యంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. ప్ర‌స్తుతం హీరోగా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. 'మిరాయ్' అనే సినిమా సోషియా ఫాంట‌సీ చిత్రంలో న‌టిస్తున్నాడు. తొలి సినిమా 'హ‌నుమాన్' కూడా సోషియా ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అవ్వ డంతో పెద్ద విజ‌యం సాధించింది.

దీంతో 'మిరాయ్' లో వార్ బ్యాక్ డ్రాప్ ని ట‌చ్ చేస్తూ అదే అంశాన్ని తీసుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ఆ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడిదే హీరోతో మెగాస్టార్ చిరంజీవి పోటీకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో 'బింబిసార' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది సోషియా ఫాంట‌సీ చిత్రం. 'జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి', 'అంజి' త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సోషియా ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది.

చాలా గ్యాప్ త‌ర్వాత సోషియా ఫాంట‌సీని చిరు ట‌చ్ చేయ‌డంతో? యంగ్ హీరో తేజ‌కి పోటీగా దిగుతున్న‌ట్లే క‌నిపి స్తుంది. ఎందుకంటే చిరు కంటే ముందే 'హ‌నుమాన్' తో తేజ ఆ జాన‌ర్ లో సినిమా చేసాడు. 'మిరాయ్' కూడా అదే జానర్లో రూపొందుతుంది. పైగా చిరంజీవి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లు పోషించిన తేజ తో చిరు పోటీ అన్న‌ది అభిమానుల‌కు క్రేజీగా ఉంది. మ‌రి ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని పంచుతాయో చూడాలి.

ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. 'విశ్వంభ‌ర' స‌మ్మ‌ర్ లో రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. 'మిరాయ్' అప్ డేట్స్ మాత్రం రావ‌డం లేదు. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా కోసం విదేశీ న‌టులు, సాంకేతిక నిపుణులు కూడా ప‌నిచేస్తున్నారు.

Tags:    

Similar News