గేమ్‌ ఛేంజర్‌.. అక్కడ దేవరను బీట్ చేస్తుందా?

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

Update: 2024-10-08 14:27 GMT

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఆ మూవీ తర్వాత రీసెంట్ గా తారక్.. దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన మూవీతో తారక్ హిట్ కొట్టేశారు! ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఆచార్యలో గెస్ట్ రోల్ చేసిన ఆయన.. ఇప్పుడు సోలోగా గేమ్ ఛేంజర్‌ చిత్రంతో వస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఓ వైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టనున్నారు.

మేకర్స్ ఇటీవల రా మచ్చా సాంగ్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి మిథ్ ను తారక్ బ్రేక్ చేశారని.. చరణ్ చేస్తారో లేదో చూడాలని అంటున్నారు. ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌.. బాలీవుడ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

దేవర బీ టౌన్ వసూళ్లతో కంపేర్ చేస్తున్నారు. బాలీవుడ్ లో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్స్ తో దేవర మూవీ.. థియేట్రికల్ రన్ ముగుస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అక్కడ ఎంత వసూలు చేస్తుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. రూ.60 కోట్లను రాబడుతుందా.. లేక దాన్ని బీట్ చేస్తుందోనని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం నెటిజన్ల చర్చ బట్టి.. గేమ్ ఛేంజర్ బాలీవుడ్ టార్గెట్ రూ.60 కోట్లు అన్నమాట!

ఇక సినిమా విషయానికొస్తే.. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నారు. శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ స్టోరీతో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీ.. మరి బాలీవుడ్ లో ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News