విజయ్ దేవరకొండ.. పోటీ లేకుండా సాధ్యమేనా?

ఈ కోరికని వచ్చే ఏడాది రాబోయే 'VD12' మూవీ తీరుస్తుందని భావిస్తున్నారు.

Update: 2024-09-26 07:30 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి 'డియర్ కామ్రేడ్' నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ పడలేదు. 2023లో వచ్చిన 'ఖుషి' మూవీ ఎబౌవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం అయితే విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నాడు. రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో నుంచి ఒక సాలిడ్ సక్సెస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ కోరికని వచ్చే ఏడాది రాబోయే 'VD12' మూవీ తీరుస్తుందని భావిస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని టాక్. రీసెంట్ గా శ్రీలంకలో కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు. మూవీలో విజయ్ దేవరకొండ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందని గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి తెలుస్తోంది.

హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ ఏడాది రిలీజ్ అయిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమాపైనే ఎక్కువ హోప్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడంట. దీని తర్వాత వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలు లైన్ అప్ లో ఉన్న కూడా మరల తన మార్కెట్ ని నిలుపుకోవాలంటే 'VD12' తో కచ్చితంగా సక్సెస్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే 'VD12' మూవీ రిలీజ్ కి ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి 'VD12' చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే సమయానికి పోటీలో వేరే సినిమాలేవీ లేవు. అయితే అనూహ్యంగా 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ మార్చి 28న కన్ఫర్మ్ చేశారు. నిజానికి 'ఓజీ' సినిమా ఆ డేట్ కి వస్తుందంటే అనుకుంటే 'హరిహర వీరమల్లు' రాబోతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాలకి పోటీగా సితార నుంచి ఏ సినిమా రిలీజ్ చేయమని నాగవంశీ గతంలో చెప్పారు. దీంతో 'VD12' మూవీ రిలీజ్ కోసం మరో డేట్ ని వెతుక్కునే పనిలో ఉన్నారంట. మరోవైపు ఏప్రిల్ 10న వద్దామని అనుకుంటే ప్రభాస్ 'ది రాజాసాబ్' రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ లోనే నెక్స్ట్ తేజ సజ్జా 'మిరాయ్' రేసులో ఉంది. దీనికి పోటీగా రిలీజ్ చేసిన పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు.

అయితే 'VD12' కోసం నిర్మాత నాగ వంశీ సోలో రిలీజ్ డేట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారంట. ఒక వేళ ఏప్రిల్ నెలలో రిలీజ్ వాయిదా పడితే మరల ప్రైమ్ డేట్ దొరకడం అంత ఈజీ కాదనేది ట్రేడ్ పండితుల మాట. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా విజయ్ స్ట్రాంగ్ గా ఒక సక్సెస్ అందులోవాల్సిన అవసరం ఉంది. కావున VD12 కోసం సోలో డేట్ వెతుక్కుంటేనే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ పోటీ లేకుండా మంచి సోలో డేట్ దొరకాలి అంటే అంత ఈజీ కాదు. చూడాలి మరి ఏమవుతుందో.

Tags:    

Similar News