డార్లింగ్ రికార్డులను ఆ స్టార్ హీరో చెరిపేస్తాడా?
సినిమాకి అక్కడ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జపాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జపాన్ లో అతడి సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. తాజాగా ఇటీవలే బ్లాక్ బస్టర్ 'జవాన్' కూడా రిలీజ్ అయింది. సినిమాకి అక్కడ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు ఏకంగా 1.96 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండు..మూడవ రోజులు సైతం అదే దూకుడు చూపించింది జవాన్. కానీ సినిమా మాత్రం ఇంకా లిస్ట్ లో ఐదవ స్థానంలో ఉంది.
డే వన్ ఫుట్‌ఫాల్స్ జాబితాలో 'జవాన్' కంటే ముందు 'సలార్' ఉంది. 2.22 వేల టిక్కెట్లతో మూడో స్థానంలో 'పఠాన్' ఉంది. 6.51 వేల టిక్కెట్లతో 'సాహో' రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఏకంగా జపాన్ లో 8.23 వేల టిక్కెట్లు అమ్మడు పోయాయి. ఈ రికార్డును బ్రేక్ చేయడం అన్నది జవాన్ కి సాధ్యం కాదు. కానీ ఓవరాల్ బిజినెస్ లో మిగతా చిత్రాల రికార్డులను మాత్రం తిరగ రాసే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
'పఠాన్', 'సలార్' తర్వాత స్థానాల్లోకి 'జవాన్' వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ వర్సెస్ షారుక్ ఫ్యాన్స్ మధ్య మళ్లీ రగడ మొదలైంది. సలార్ రికార్డులను జవాన్ చేజ్ చేస్తుందంటూ షారుక్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. షారుక్ అభిమానులకు ఇప్పుడీదో పీస్ట్ లా మారింది. ప్రతిగా డార్లింగ్ అభిమానులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
జపాన్ లో షారుక్-ప్రభాస్ ఇద్దరికీ భారీ ఎత్తున ఫాలో యింగ్ ఉంది. ప్రత్యేకంగా ప్రభాస్ కోసం జపాన్ నుంచే వచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ వచ్చి మరీ విషెస్ చెప్పిన డార్లింగ్ జపాన్ అభిమానులెంతో మంది. షారుక్ విషయంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.