ఆ ఇద్దరు కలిస్తే మాస్ కి మొగుళ్లే!
లియో కి డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కూలీతో సత్తా చాటలని లోకేష్ మరింత సీరియస్ గా పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో `కూలీ`ని సెట్స్ పైకి తీసుకెళ్లి ఆ సినిమా పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మే 1న చిత్రాన్ని రిలీజ్ చేస్తు న్నారు. దీంతో ఈలోపు అన్ని పనులు పూర్తి చేసి సిద్దంగా ఉండాలని లోకేష టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. 'లియో' తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. లియో కి డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కూలీతో సత్తా చాటలని లోకేష్ మరింత సీరియస్ గా పనిచేస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ నుంచి ఏ సినిమా సెట్స్ కి వెళ్తుంది? అన్నది సరైన క్లారిటీ లేదు. అదీ 'ఖైదీ -2' అవుతుందా? 'విక్రమ్' సీక్వెల్ అవుతుందా? 'రోలెక్స్' పట్టాలెక్కుతుందా? పార్తీబన్ 'లియో-2' నా? అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా లోకేష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. తల అజిత్ కుమార్ తో కూడా సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. 'అందరిలాగే నేను కూడా ఎకె సార్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను.
అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు. దీంతో అజిత్ కూడా ఎల్ సీయూలోకి ఎంట్రీ ఇస్తు న్నారా? అన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. అజిత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ కి లోకేష్ సెట్ అయితే మామూలుగా ఉండదు. కోలీవుడ్ మాస్ హీరోల్లో అజిత్ మాస్ ఇమేజ్ అన్నది ఎంతో ప్రత్యేకమైనది. గత కొంత కాలంగా అజిత్ చేస్తోన్న చిత్రాలు మాస్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.
కంటెంట్ కి తగ్గ కటౌట్ కుదురుతుంది. రజనీకాంత్, విజయ్ కూడా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలైనా? అజిత్ మాస్ మాత్ర కోలీవుడ్ సహా టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకమైంది. 'విశ్వాసం', ' నెర్కొండ పార్వై', 'వలిమై',' తనీవు' లాంటి చిత్రాలతో అజిత్ మాస్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ తో అజిత్ సినిమా పడితే? అది వేరే లెవల్లో ఉంటుంది. లోకేష్ మాస్ కంటెంట్ కి పర్పెక్ట్ గా సూట్ అయ్యే హీరో అజిత్.