లోకేష్ యూనివర్స్.. నాని కూడానా?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీని ఫస్ట్ మూవీగా తీసుకొచ్చి సౌత్ లో తొలిసారి యూనివర్స్‌ లకు తెర లేపిన డైరెక్టర్‌ గా నిలిచారు.

Update: 2024-10-27 20:30 GMT

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మా న‌గ‌రం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. డెబ్యూతో సూప‌ర్ హిట్ అందుకున్నారు. ఆ త‌ర్వాత స్టార్ హీరో కార్తీతో ఖైదీ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీని ఫస్ట్ మూవీగా తీసుకొచ్చి సౌత్ లో తొలిసారి యూనివర్స్‌ లకు తెర లేపిన డైరెక్టర్‌ గా నిలిచారు.

తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ కథకు కొనసాగింపుగా విక్రమ్‌, లియో సినిమాలు కూడా తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు లోకేష్. మధ్యలో మాస్టర్ మూవీ తీసి అదరగొట్టేశారు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

రజినీ కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్ చేయనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. సూర్య కూడా అందులో నటిస్తున్నట్లు కార్తీ రీసెంట్ గా తెలిపారు. లోకేష్ కూడా ఖైదీ మూవీ రిలీజ్ అయ్యి ఐదేళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఢిల్లీ (కార్తీ రోల్ నేమ్) మళ్లీ రాబోతున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో నెక్స్ట్ ఖైదీ-2నే లోకేష్ కనకరాజ్ స్టార్ట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నేచురల్ స్టార్ నానితో లోకేష్ ఓ సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం.. జూనియర్ ఎన్టీఆర్ తో లోకేష్ వర్క్ చేయనున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు నాని పేరు వినిపిస్తోంది. మరోవైపు.. నానితో సింగిల్ మూవీ కాదని, ఖైదీ సీక్వెల్ లోని ఓ రోల్ ను ఆయనకు ఇవ్వనున్నారని ఊహాగానాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఇప్పుడు స్పందిస్తున్నారు. దసరా మూవీ కోసం తనలోని మాస్ టాలెంట్ ను బయటపెట్టిన నాని.. లోకేష్ తో ఇప్పుడు వర్క్ చేస్తే బొమ్మ అదుర్సేనని కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి హీరోలను తన సినిమాల్లో లోకేష్ ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. దీంతో నానిని ఎలా చూపిస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి నానితో లోకేష్ వర్క్ చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News