అక్కడ అబ్బాయ్ కి బాబాయ్ తోడుగా నిలుస్తాడా?

ఇప్పుడు ''గేమ్ ఛేంజర్'' చిత్రానికి కూడా అన్ని వెసులుబాటులు ఉంటాయని ఆశిస్తున్నారు. అందుకే టీమ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నట్లుగా టాక్.

Update: 2024-12-28 02:45 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "గేమ్ ఛేంజర్". దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ గత చిత్రం 'భారతీయుడు 2' డిజాస్టర్ గా మారడం వల్ల కొంత బజ్ తగ్గినప్పటికీ, RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చెర్రీ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

'గేమ్ ఛేంజర్' సినిమాని జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలు, యూఎస్ఏ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్, శంకర్ సహా టీమ్ అంతా వెళ్లి డల్లాస్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి వచ్చారు. ఒక తెలుగు సినిమాకి అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో తెలుగు స్టేట్స్ లోనూ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్స్ చేయడానికి 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జనవరి 4న విజయవాడలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇకపోతే తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుదల ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ ప్రముఖులు మీటింగ్ పెట్టి మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. కాకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసి అతి త్వరలోనే ఈ విషయం మీద నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. 'గేమ్ ఛేంజర్' సినిమాకి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అనుమతులు వచ్చినా రాకపోయినా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని భావిస్తున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులోనూ స్వయానా రామ్ చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి అంతా ఆయన చూసుకుంటారని మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కల్కి, దేవర-1, పుష్ప-2 సినిమాలకు హైక్స్, అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో.. ఇప్పుడు ''గేమ్ ఛేంజర్'' చిత్రానికి కూడా అన్ని వెసులుబాటులు ఉంటాయని ఆశిస్తున్నారు. అందుకే టీమ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నట్లుగా టాక్.

ఏదేమైనా 'గేమ్ ఛేంజర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొడతారని అనిమానులు ధీమాగా ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. పస్టాఫ్ అబౌవ్ యావరేజ్ గా వచ్చిందని, సెకండాఫ్ సూపర్ గా ఉందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. చరణ్ నటనకు మంచి మార్కులు పడతాయని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News