ప్ర‌భాస్ అక్క‌డికి వెళ్తాడా? ఇక్క‌డికే వ‌స్తాడా?

అయితే ప్ర‌భాస్ అందుకోసం చెన్నై వెళ్తారా? హైద‌రాబాద్ కే వ‌ర‌కే ప‌రిమితం అవుతారా?

Update: 2024-10-16 01:30 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న 'కంగువ‌'పై ఎలాంటి అంచనాలు న్నాయ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. సూర్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇది. అంతే ప్ర‌తిష్టా త్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. పీరియాడిక్ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్ప‌టికే అంత‌కంత‌కు హైప్ తీసుకొచ్చాయి. అన్ని ప‌నులు పూర్తి చేసి న‌వంబ‌ర్ 14న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో యూవీ క్రియేష‌న్స్ కూడా భాగ‌స్వామి. స్టూడియో గ్రీన్స్ తో క‌లిసి యూవీ సంస్థ నిర్మిస్తుంది. అంటే ఈ సినిమా కి త‌ప్ప‌కుండా ప్ర‌భాస్ స‌హ‌క‌రించాల్సిందే. యూవీ అన్న‌ది వాళ్ల సొంత సంస్థ అన్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి డార్లింగ్ త‌ప్ప‌కుండా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. అత‌డి ఎంట్రీ సినిమాకి కోట్ల రూపాయ‌ల ప్ర‌చారాన్ని తీసుకొస్తుంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ప్రీరిలీజ్ మెయిన్ గెస్ట్ గా హైలైట్ అయ్యే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌భాస్ అందుకోసం చెన్నై వెళ్తారా? హైద‌రాబాద్ కే వ‌ర‌కే ప‌రిమితం అవుతారా? అన్న‌ది తేలాల్సిన అంశం. రెండు రాష్ట్ర‌ల్లోనూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే డార్లింగ్ చెన్నైకి వెళ్తారా? లేక హైద‌రాబాద్ ఈవెంట్ కివెళ్త‌రా? అన్న‌ది బిగ్ క్వ‌శ్చ‌న్. ఈ రెండు గాక రెండు చోట్లా హాజ‌రైతే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

ఇదంతా పక్క‌న బెడితే సూర్య అంటే ప్ర‌భాస్ కి విప‌రీత‌మైన అభిమానం. సూర్య క‌ళ్లు అంటే పిచ్చి. ఇండియాలో క‌ళ్ల‌తో మాత్ర‌మే న‌టించ‌గల ఏకైక స్టార్ గా సూర్య‌ని అభివర్ణిస్తారు. అలాంటి స్టార్ ఈవెంట్ కి డార్లింగ్ హాజ‌రైతే? ఒకే వేదిక‌పై సూర్య‌- ప్ర‌భాస్ ల‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వేమో.

Tags:    

Similar News