ప్రభాస్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి సర్‌ప్రైజ్ కన్ఫర్మ్!
ఇన్ని సినిమాలు ఉండగానే ప్రభాస్ నుంచి ఇప్పటికే హెంబళే ప్రొడక్షన్స్‌కి మరో సినిమాను చేసేందుకు కమిట్‌మెంట్ ఇచ్చాడట.
ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత సలార్ 2, స్పిరిట్, కల్కి 2 సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే ప్రభాస్ నుంచి ఇప్పటికే హెంబళే ప్రొడక్షన్స్‌కి మరో సినిమాను చేసేందుకు కమిట్‌మెంట్ ఇచ్చాడట. ఆ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న ప్రకారం ప్రభాస్ హీరోగా హొంబళే ప్రొడక్షన్స్‌లో రూపొందబోతున్న సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఇటీవల ప్రభాస్ ఒక వీడియోలో కనిపించి మిర్చి లుక్‌తో అలరించాడు. ఆ లుక్ లోకేష్ కనగరాజ్ సినిమా కోసం అనే ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రారంభానికి ముందు లోకేష్ కనగరాజ్ ఒక వీడియోను విడుదల చేయడం మనం చూస్తూ ఉంటాం. లియో సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో ఒక వీడియోను విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశాడు. అలాగే ప్రభాస్ సినిమా ప్రారంభోత్సవం కు ముందే ఒక వీడియోను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ని ఆ లుక్‌కి మార్చారా అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రభాస్, లోకేష్ కనగరాజ్ సినిమా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కూలీ సినిమాతో రజనీకాంత్ కి భారీ విజయాన్ని కట్టబెట్టేందుకు దర్శకుడు చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా గురించి అప్డేట్ ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ప్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చే విధంగా సంక్రాంతికి సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని లేదంటే అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేయడం ద్వారా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు సలార్ 2 సినిమా షూటింగ్ 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ ఏడాదిలో ఆ షూటింగ్‌ను ముగించి 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు. మరో వైపు ఆయన ఎన్టీఆర్‌తో సినిమాకి రెడీ అవుతున్నారు.