మాజీలిద్దరు ఒకే వేదికపై ఎందుకంటే?
కానీ విడిపోయిన తర్వాత మాత్రం మళ్లీ కలిసి పనిచేయలేదు.
నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్- గాయని సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ల బంధానికి ఈ ఏడాది ఆరంభంలోనే ముగింపు పలికారు. ఇద్దరు పెళ్లికాక ముందు ఎన్నో సినిమాలకు కలిసి పనిచేసారు. పెళ్లైన తర్వాత కూడా చాలా సినిమాల్లో కలిసి పాడారు. పెళ్లికి ముందు స్నేహితులుగానూ కలిసి పనిచేసారు. కానీ విడిపోయిన తర్వాత మాత్రం మళ్లీ కలిసి పనిచేయలేదు.
తాజాగా విడిపోయిన తర్వాత తొలిసారి కలిసి పనిచేయాల్సిన సన్నివేశం ఏర్పడింది. డిసెంబర్ 7న మలేయాషి యాలో సంగీత కచేరి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రకాష్-సైంధవి కలిసి పాల్గొంటున్నారు. ఆ రకంగా విడి పోయిన తర్వాత ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తోంది. వ్యక్తిగత జీవిత పరంగా విడిపోయినా వృత్తిగతంగా కలిసి పని చేయక తప్పదు. భార్యభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసి మెలిసి ఉండటం సెలబ్రిటీలకు అలవాటైన పనే.
ప్రస్తుతం ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.జీవీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా పుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇటీవల ఆయన సంగీతం అందించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తంగలన్, అమరన్ సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు గాక మరో ఐదు సినిమాలకు సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ పరంగా సక్సెస్ అయినా? సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు.
ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలున్నాయి. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తున్నారు. కంగన నటిస్తోన్న `ఎమర్జెన్సీ` చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. అటు నటుడిగానూ మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు.