2025 లో మెగా ఇంట్లో భాజాలు తప్పవా?
ఇంతకీ మెగా ఫ్యామిలీ నుంచి పెళ్లి కొడుకు అయ్యేది ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
మెగా ఇంట్లో 2025లో పెళ్లి భాజాలు మోగడం ఖాయమేనా? వయసు 40కి రీచ్ అవ్వడంతో మామ్ తనయుడిపై ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మెగా ఫ్యామిలీ నుంచి పెళ్లి కొడుకు అయ్యేది ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతడే మెగా మేనల్లుడు సాయితేజ్. టాలీవుడ్ లో అతడి జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును దక్కించుకుని కెరీర్ కొనసాగిస్తున్నాడు.
'విరూపాక్ష' విజయంతో 100 కోట్ల క్లబ్ లోనూ చేరాడు. దీంతో తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరిగా సంబరాల ఏటి గట్టు అనే సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇదే ఏడాది మెగా అల్లుడు పెళ్లి శుభవార్త కూడా చెప్పే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. కుటుంబ సబ్యులు పిల్లను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిసింది.
తేజ్ కు ఎలాగూ ఎలాంటి లవ్ లు లేని నేపథ్యంలో పెద్దల చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి నిశ్చియించు కున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయితేజ్ తల్లి సీరియస్ గా సంబంధాలు చూస్తున్నట్లు సమాచారం. పైగా తేజ్ కు వయసు కూడా మీరుతుంది. ప్రస్తుతం అతడి వయసు 38. 2026 కి 40 ఏళ్లు మీద పడతాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో 2025లో పెళ్లి చేయాలని ఫ్యామిలీ అంతా సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం.
సాయితేజ్ కెరీర్ లో మామ్ ఎంతో కీలకం. చిన్ననాటి నుంచి అతడు స్టార్ అయ్యే వరకూ అన్ని బాధ్యతలు ఆమె చూసుకున్నారు. నటుడు అవ్వడం వెనుక పెద్ద మామ చిరంజీవి కీలక పాత్ర పోషించారు. వైజాగ్ సత్యానంద్ దగ్గరకు చిరు రికమండీషన్ తో ట్రైనింగ్ తీసుకున్నారు. అటుపై ప్రాజెక్ట్ చేసారు. అనంతరం మూడవ మామ పవన్ కళ్యాణ్...తేజ్ డౌన్ ఫాల్ లో ఉన్న సమయంలో బూస్టింగ్ ఇచ్చారు. ఇలా చిరు-పవన్ లు సాయితేజ్ కెరీర్ లో కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చిరంజీవి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.