సమంత రూత్ ప్రభు తక్షణ కర్తవ్యం?
సిటాడెల్ -హనీ బన్నీ భారతీయ వెర్షన్ లో సమంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించింది.
అమెరికన్ వెబ్ సిరీస్ లలో శృంగారం, యాక్షన్ కంటెంట్ పాళ్లు చాలా ఎక్కువ. సిటాడెల్ వెబ్ సిరీస్ లో పెచ్చుమీరిన యాక్షన్, శృంగారం గురించి చాలా చర్చ సాగింది. ప్రియాంక చోప్రా పెళ్లి తరవాత కూడా ఎలాంటి భేషజం లేకుండా కోస్టార్స్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించింది. అయితే భారతీయ వెర్షన్ విషయంలో శృంగారం పాళ్లను బ్యాలెన్స్ చేసారు రాజ్ అండ్ డీకే. యాక్షన్ కంటెంట్ కి ఇక్కడ ప్రాధాన్యతను పెంచారు. సిటాడెల్ -హనీ బన్నీ భారతీయ వెర్షన్ లో సమంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించింది. తన కోస్టార్ గా నటించిన వరుణ్ ధావన్ కంటే సమంతకే ఎక్కువ గుర్తింపు కూడా దక్కింది. ఒక రకంగా సిటాడెల్ ని సామ్ హైజాక్ చేసిందని పలువురు విశ్లేషించారు.
అదంతా అటుంచితే, సమంత తదుపరి స్టెప్ ఏమిటి? అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సొంత బ్యానర్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే 'ఏమాయ చేశావే' సహా పలు చిత్రాలతో తనకు బలమైన పునాదిని ఇచ్చిన గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తోందని కూడా ప్రచారమైంది. కానీ ఇవేవీ పట్టాలెక్కినట్టు సమాచారం లేదు.
ఇలాంటి సమయంలో సమంత తన తదుపరి ఓటీటీ ప్రాజెక్ట్ పై మాత్రమే దృష్టి సారించనుందని భావిస్తున్నారు. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్ లో నటించడంపైనా సమంత దృష్టి సారిస్తోందా? రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చిత్రీకరణ గురించి కూడా ఇటీవల అప్ డేట్ లేదు. అయితే తన మాజీ భర్త నాగచైతన్య పెళ్లి తర్వాత సమంత తన స్నేహితురాళ్లతో కలిసి పార్టీ చేసుకుంది అంటూ వెబ్ లో కథనాలు వైరల్ అయ్యాయి. మరోవైపు సమంత వాణిజ్య ప్రకటనల ప్రచారం.. సోషల్ మీడియాల్లో హెల్త్ టిప్స్ ని అందించే పనిలో కూడా బిజీగా ఉంది. అందువల్ల సమంత నటించే తదుపరి సినిమా గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు.
సల్మాన్ తో.. తాప్సీతో..?
మయోసైటిస్ నుంచి కోలుకుని 'సిటాడెట్- హనీ బన్నీ'లో నటిస్తున్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన సమంత నటించనుందని కథనాలొచ్చాయి. అలాగే తాప్సీ పన్ను నిర్మించే సినిమాల్లోను సమంత నటించనుందని కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ఇవేవీ నిజాలు కాదని ప్రూవ్ అయింది.