శ్రద్ధగా ప్లాన్ చేస్తుంది కానీ..?
విశ్వక్ సేన్ తో ఫలక్ నుమా దాస్ అవకాశం ఇస్తానన్నా ఆమె కాదన్నదట.
కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ముందే తన టాలెంట్ చూపించి సత్తా చాటిన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ఎంట్రీనే కాస్త లేట్ అయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా కూడా అమ్మడికి ఎందుకో సరైన అవకాశాలు రాలేదు. ఛాన్స్ లు రాలేదు అని చెప్పడం కన్నా వచ్చినా సరే తనకు నచ్చక వదిలేసింది అన్నట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ తో ఫలక్ నుమా దాస్ అవకాశం ఇస్తానన్నా ఆమె కాదన్నదట.
ఇప్పుడు అతనితోనే మెకానిక్ రాకీ సినిమాలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్. కథానాయిక అంటే కథలో భాగం అవ్వాలి.. ఏదో ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రలా ఉండకూడదు అని చెప్పే వారిలో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు. అందుకే అమ్మడు ఏరి కోరి సినిమాలు చేస్తుంది. ఐతే నాని జెర్సీ తర్వాత ఆది సాయి కుమార్ తో జోడీ సినిమా చేసింది శ్రద్ధ. ఆ సినిమా అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లినో తెలియదు. ఆ షాక్ వల్ల తెలుగు సినిమాలంటే అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.
ఐతే ఈ ఇయర్ విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమాలో నటించింది శ్రద్ధ. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇక టాలీవుడ్ వైపు మళ్లీ చూడదని అనుకున్నారు కానీ సౌత్ అన్ని పరిశ్రమల్లో కన్నా తెలుగులో ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అందుకే శ్రద్ధ శ్రీనాథ్ కూడా తెలుగు లోనే ఎక్కువ ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మెకానిక్ రాకీ వస్తుంది.
ఈ సినిమాతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ లో కూడా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. మెకానిక్ రాకీ హిట్ పడితే మాత్రం కచ్చితంగా అమ్మడికి టాలీవుడ్ లో మళ్లీ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అభినయ తారగా తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా పర్ఫెక్ట్ గా చేస్తూ వస్తున్న శ్రద్ధ శ్రీనాథ్ మెకానిక్ రాకీ, డాకు మహారాజ్ సినిమాలతో తెలుగులో తిష్ట వేయాలని ఫిక్స్ అయ్యింది.
శ్రద్ధ లాంటి నటీమణులను ఎంకరేజ్ చేస్తే వారు ఇంకా చాలా గొప్ప పాత్రలు చేసే అవకాశం ఉంటుంది. ఐతే శ్రద్ధ కూడా అందుకు తగినట్టుగానే ప్లాన్ చేసుకుంటుంది. సినిమాలు సక్సెస్ అవుతుంటే ఎంకరేజింగ్ గా ఉండి మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని ఉంటుంది. మరి టాలీవుడ్ ఆడియన్స్ శ్రద్ధ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారన్నది చూడాలి.