డాకు మహారాజ్.. దబిడి దిబిడి వచ్చేస్తుంది..!
డాకు మహారాజ్ నుంచి మొదటి సాంగ్ టైటిల్ సాంగ్ కాగా రెండోది చిన్ని సాంగ్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబోలో వస్తున్న డాకు మహారాజ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో అన్నిటినీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగేందుకు వస్తున్న బాలయ్య సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజ్ నుంచి 3వ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డాకు మహారాజ్ నుంచి మొదటి సాంగ్ టైటిల్ సాంగ్ కాగా రెండోది చిన్ని సాంగ్ వచ్చింది.
ఆ రెండు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా థర్డ్ సాంగ్ ని దబిడి దిబిడి అని దించుతున్నారు. బాలయ్య విలన్లకు వార్నింగ్ ఇస్తూ చెప్పే డైలాగ్ దబిడి దిబిడి. ఆ డైలాగ్ నే సాంగ్ లిరిక్ గా వాడుతున్నారు. థమన్ ఈ సాంగ్ ని తన మార్క్ కంపోజింగ్ తో అదరగొట్టేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా మాస్ యాక్షన్ మూవీగా వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది.
సాంగ్స్ కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇతర హీరోల సినిమాలేమో కానీ బాలకృష్ణ సినిమా అనగానే థమన్ పూనకాలు వచ్చినట్టే మ్యూజిక్ ఇస్తాడు. డాక్ టైటిల్ సాంగ్ అయితే నందమూరి ఫ్యాన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. ఇక రాబోతున్న దబిడి దిబిడి సాంగ్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. దబిడి దిబిడి సాంగ్ లో బాలకృష్ణ ఊర్వశి రౌతెల కలిసి స్టెప్పులు వేసినట్టు తెలుస్తుంది.
డాకు మహారాజ్ నుంచి థర్డ్ సాంగ్ గా దబిడి దిబిడి సాంగ్ గురువారం రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి ఫైట్ లో బాలయ్య గర్జన ఒక రేంజ్ లో ఉండేలా ఉందని డాకు మహారాజ్ ప్రోమోస్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న బాలయ్యకు డాకు మహారాజ్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడన్నది చూడాలి.
వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్యతో డాకు మహారాజ్ చేశాడు. ఐతే డాకు మహారాజ్ టీజర్స్ చూస్తుంటే బాలకృష్ణని ఇలా కొత్తగా ఈమధ్య కాలంలో ఎవరు చూపించలేదు అనేట్టుగా డైరెక్టర్ చూపిస్తున్నాడు. మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది రేపు సినిమా రిలీజ్ అయ్యాక రాబట్టే కలెక్షన్స్ ని బట్టి తెలుస్తుంది.