సీతారామ‌రాజు పాత్ర‌లో ప్ర‌భాస్..పెద్ద‌మ్మ తీవ్ర ప్ర‌య‌త్నాలు!

ఆ విశేషాలు ఆమె మాట‌ల్లోనే.. 'అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రభాస్ చేస్తే, సీతారామరాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో ప్రభాస్ను చూడాలని చాలామంది

Update: 2024-07-05 14:30 GMT

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు బ‌యోపిక్ లో డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించే ఛాన్స్ ఉందా? ప్ర‌భాస్ ని సీతారామ‌రాజుగా చూడాల‌న్న‌ది పెద్ద‌మ్మ శ్యామ‌ల‌దేవి కోరికా? ఆ కోరిక వెనుక పునాది వేసింది భ‌ర్త‌ కృష్ణం రాజు నా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలలో పాల్గొన్న శ్యామలాదేవి సీతారామ‌రాజు బ‌యోపిక్ గురించి ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు.

ఆ విశేషాలు ఆమె మాట‌ల్లోనే.. 'అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రభాస్ చేస్తే, సీతారామరాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో ప్రభాస్ను చూడాలని చాలామంది అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కొంత మంది అభిమానులు స్వ‌యంగా న‌న్ను అడ‌గ‌డం జ‌రిగింది. వారి కోరికను నేను ప్రభాస్‌కు తెలియజేస్తాను. ఆ పాత్ర చేసే విషయంలో ఎలాంటి అవకాశమున్నా నేను చేయ‌మ‌నే చెబుతాను. మ‌న్యం వీరుడిగా నా బిడ్డ‌ను చూడాల‌ని ఆశ‌గా ఉంది.

15ఏళ్ల క్రితం అల్లూరి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని కృష్ణంరాజుగారు అప్పట్లో చాలా ప్రయత్నించారు. అప్పటి స్పీకర్ మీరా కుమారిగారిని కూడా కోరారు. ఆమె కూడా అందరికి తెలియజెప్పి చేయిద్దాం అన్నారు కానీ.. ఎందుకో జాప్యం జరిగింది. మళ్లీ ఆయన స్ఫూర్తితో దేశ ప్రధానికి, రాష్ట్రపతికి, రాష్ట్ర ముఖ్యమంత్రు లకి కూడా మరొక్కసారి ఈ విషయాన్ని విన్నవించుకోవాలని అనుకుంటున్నాం. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టిన రోజున.. మేమంతా మా కన్నీటితో నివాళులు అర్పించాలనేలా నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలోనే జరుగుతుందనే ఆశ కూడా మాకు ఉంది' అని అన్నారు.

Read more!

మ‌న్యం వీరుడి పాత్ర‌కు డార్లింగ్ ఎస్ చెబితే మాములుగా ఉండ‌దు. అప్ప‌ట్లో సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లూరి బ‌యోపిక్ ని తెర‌కెక్కించి ఎంత‌టి సంచ‌ల‌నం చేసారో తెలిసిందే. తాను మాత్రమే సీతారామ‌రాజు బ‌యోపిక్ కి అర్హుడ‌ని ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సీతారామ‌రాజు క‌థ‌ని తీసే సాహ‌సం ఏ ద‌ర్శ‌కుడు తీయ‌లేదు. మ‌ళ్లీ ఇంత కాలానికి ప్ర‌భాస్ పేరు తెర‌పైకి వ‌స్తోంది. ప్ర‌భాస్ ఒకే చెప్పి రాజమౌళి టేక‌ప్ చేస్తే సీతారామ‌రాజు వ‌ర‌ల్డ్ ని షేక్ చేయ‌డం ఖాయం.

Tags:    

Similar News

eac