ఇప్పటికైనా ఆ స్టార్ హీరోని రాజమౌళి కన్సిడర్ చేస్తాడా..?
వీరితో పాటు నితిన్, నాని కూడా సినిమాలు చేశారు అది వేరే విషయం.
పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవాలంటే ఆ హీరో రాజమౌళితో సినిమా చేయాలన్న టాక్ వచ్చేసింది. అఫ్కోర్స్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ కి రాజమౌళి వెళ్లాడు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన స్టార్స్ ఎవరన్నది చూస్తే.. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్ ఆ తర్వాత రవితేజ. వీరితో పాటు నితిన్, నాని కూడా సినిమాలు చేశారు అది వేరే విషయం.
రాజమౌళితో సినిమా చేయకుండానే పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నడు అల్లు అర్జున్. నిర్మాత కొడుకుగా కాదు ఒక సినీ ప్రేమికుడిగా ప్రతి సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెడుతూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్. పుష్ప కన్నా ముందు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతోనే నాన్ బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇక పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్లో బీభత్సం సృష్టించాడు.
రాజమౌళి తన హీరోలను కథను బట్టే ఎంపిక చేస్తుంటాడు. అయితే కొన్ని కాంబినేషన్స్ ఆయన కావాలనే సెట్ చేస్తాడు. ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి కథ రెడీ చేయమని చెబుతాడు. ప్రభాస్ తో చేసిన సినిమాలు దాదాపు అలానే వచ్చాయి. మహేష్ తో త్వరలో సినిమా చేస్తున్నాడు. ఐతే రాజమౌళి దృష్టిలో అల్లు అర్జున్ ఎప్పుడు పడలేదు. పుష్ప ముందు వరకు ఏమో కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ ని రాజమౌళి కన్సిడర్ చేయాల్సిందే.
అల్లు అరవింద్ తలచుకుంటే రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ రాజమౌళి తనంతట తాను అల్లు అర్జున్ తో సినిమా చేసేలా చేసుకోవాలని బన్నీ ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. తన ప్రతి సినిమాతో తన వర్సటాలిటీ చూపిస్తున్న అల్లు అర్జున్ పుష్ప హిట్ లో కీ రోల్ పోషించాడు. పుష్ప రాజ్ గా అతను చూపించిన అభినయం ఆ మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కే కాదు సెలబ్రిటీస్ కి కూడా పూనకాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు కచ్చితంగా రాజమౌళి తన హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ ని చేర్చుకుంటాడు. మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
రాజమౌళి అల్లు అర్జున్ కాంబో కోసం అల్లు ఫ్యాన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కలయికలో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.